నాన్సీ ని అవమానించిన ట్రంప్..ప్రతిగా ఏమి చేసిందో తెలుసా...!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై డెమొక్రాట్ పార్టీ నేతలు ప్రవేసపెట్టిన అభిశంసన విషయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఎట్టకేలకి ఈ అభిశంసన లో డెమోక్రటిక్ పార్టీ ఓడినా తుది గెలుపు తమదే అంటున్నారు.

 Trump Insults Nancy-TeluguStop.com

అయితే ప్రతినిధుల సభలో గెలిచిన అభిశంసన, సెనేట్ లోకి విచారణకి వెళ్ళింది.ఈ క్రమంలో ట్రంప్ ఈ సెనేట్ ముందు అభిశంసనకి హాజరయ్యారు.

ఇక్కడ జరిగిన ఆసక్తికరమైన పరిణామాలు ఇప్పుడు అభిశంసన కంటే కూడా హైలెట్ అవుతున్నాయి…

ప్రతినిధుల సభ స్పీకర్, డెమోక్రటిక్ పార్టీ సీనియర్ లీడర్ అయిన నాన్సీ ఫెలోసీ కి ట్రంప్ కి ముందు నుంచీ పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటుంది.వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధం అమెరికా ప్రజలకి కొత్తేమి కాదు.

అయితే మరోసారి సెనేట్ లో అభిశంసన జరగబోయే సమయంలో మరోసారి వీరి ఇద్దరి మధ్య గొడవలు మళ్ళీ బయటపడ్డాయి.ఈ సభలో అధ్యక్షుడిగా పసంగించే ఆహ్వాన సమయంలో సభా సాంప్రదాయల ప్రకారం.

Telugu Donald Trump, Nancy, Telugu Nri, Trumpinsults-Telugu NRI

ట్రంప్ ని ఆహ్వానించడం నాకు దక్కిన ప్రత్యేక గౌరవం, గొప్ప ఆధిక్యత అటూ చెప్పాలి కానీ నాన్సీ అత్యంత సాధారణంగా ట్రంప్ ని ఆహ్వానించారు.వేదికపై అందరికి అభివాదం చేస్తూ ట్రంప్ తన ప్రసంగ ప్రతిని నాన్సీకి అందించారు.వాటిని అందుకున్న నాన్సీ ట్రంప్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించగా ట్రంప్ ఆమెని పట్టించుకోలేదు.దాంతో ఒళ్ళు మండిన నాన్సీ ట్రంప్ ప్రసంగం, ముగిసిన తరువాత ట్రంప్ ఇచ్చిన ప్రతుల్ని అడ్డంగా చింపేశారు.

దాంతో ఇప్పుడు ఆ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube