దొంగతనం చేశాడని చిత్రహింసలు పెట్టిన పోలీసులు... వీడియో వైరల్

ఈ మధ్య కాలంలో కొందరు పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని అధికారంలో చేతిలో ఉంది కదా అని దురుసుగా ప్రవర్తిస్తున్నారని బహిరంగంగానే కొందరు ప్రజల నుండి విమర్శలు వ్యక్తమవుతూ ఉంటాయి.తాజగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి విషయంలో పోలీసులు మరీ క్రూరంగా ప్రవర్తించారు.

 Police Torchered Thief Video Goes Viral In Social Media-TeluguStop.com

ఒక వ్యక్తిని సెల్ ఫోన్ ను దొంగతనం చేశాడనే ఆరోపణలతో అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు.

గత గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

సుమిత్ గోస్వామి అనే వ్యక్తిని ఒక వ్యక్తికి సంబంధించిన మొబైల్ పోయిందని సుమిత్ గోస్వామే ఆ మొబైల్ ను తీశాడనే అనుమానంతో అదుపులోకి తీసుకొని పోలీసులు గొడ్డును బాదినట్టు చితకబాదారు.తనకే పాపం తెలీదని ఆ సెల్ ఫోన్ కు తనకూ ఎటువంటి సంబంధం లేదని దయచేసి చిత్రహింసలు పెట్టవద్దని ఎంత చెప్పినా పోలీసులు మాత్రం అతని మాటలను పట్టించుకోలేదు.

బెల్టుతో, బూటు కాళ్లతో విచక్షణా రహితంగా ముగ్గురు పోలీసులు సుమిత్ గోస్వామిపై దాడి చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అయింది.

ఉన్నతాధికారులు ఈ ఘటనపై వెంటనే స్పందించి సుమిత్ ను చితకబాదిన పోలీసులను సస్పెండ్ చేయడంతో పాటు పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణకు ఆదేశించారు.వైద్య పరీక్షల కొరకు బాధితుడు సుమిత్ ను ఆస్పత్రికి తరలించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube