వావ్‌ : అందం కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేసింది, ఇప్పుడు కోట్లు సంపాదిస్తోంది

గతంలో ఎంతో మంది అందం కోసం లక్షలు ఖర్చు చేసిన వార్తలు మనం చూశాం.చాలా మంది అందం కావాలనే ఉద్దేశ్యంతో ఆపరేషన్స్‌ చేయించుకున్నారు.

 Surgerys To Make Face Attractive-TeluguStop.com

కాని ఎక్కువ మంది అందం దక్కించుకోలేక పోగా డబ్బు పోగొట్టుకుని అనారోగ్యం పాలయ్యారు.కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఎంత వరకు కావాలో అంతే ఆపరేషన్స్‌ చేయించుకుంటూ ఆపరేషన్‌ ఆపరేషన్‌కు మద్య కనీసం గ్యాప్‌ మెయింటెన్‌ చేయడం వల్ల అందంగా అయ్యే అవకాశం ఉంటుందని టీస్సా నిరూపించింది.

29 ఏళ్ల టీస్సా ప్రస్తుతం టెక్సాస్‌లో ప్రముఖ మోడల్‌గా దుమ్ము రేపుతోంది.ఈమె ఏడాదికి కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఈమె అందంకు ఫిదా అవ్వని మగాడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో.అయితే ఈ అమ్మడు కొన్ని సంవత్సరాల క్రితం ఇలా ఉండేది కాదు.

అసలు ఈమెను చూడాలంటేనే చిన్న పిల్లలు భయపడేవారు, అబ్బాయిలు ఆసక్తి చూపించే వారు కాదు.అలాంటి టీస్సా ఇప్పుడు అందంకు అర్థంలా మారిపోయింది.

Telugu Pastick Surgery, Surgerysface, Telugu Ups-General-Telugu

అందుకోసం టీస్సా పడ్డ కష్టాలు మామూలువి కాదు.దాదాపు మూడు సంవత్సరాలు వరుసగా ఆపరేషన్స్‌ చేయించుకుంది.సంవత్సరం పాటు పూర్తి విశ్రాంతిలో ఉండి ఎక్సర్‌సైజ్‌లు మాత్రమే చేస్తూ వచ్చింది.నాలుగు సంవత్సరాలు పడ్డ కష్టంకు ఇప్పుడు ఆమె ఒక స్టార్‌ అయ్యింది.ఆపరేషన్స్‌ కోసం 50 వేల ఫౌండ్స్‌ అంటే దాదాపుగా 50 లక్షల రూపాయలను ఆమె ఖర్చు చేసింది.అంత డబ్బు ఆమె ఖర్చు చేస్తుంటే సన్నిహితులు మరియు స్నేహితులు ఆమెను తిట్టేవారు.

Telugu Pastick Surgery, Surgerysface, Telugu Ups-General-Telugu

అందం లేకుంటే ఏంటీ డబ్బు ఎందుకు వృధా చేస్తున్నావంటూ చాలా మంది అన్నారు.కాని టీస్సా మాత్రం పట్టుదలతో అందం కోసం ప్రయత్నాలు చేసింది.అనుకున్నట్లుగానే ఆమె అందంగా తయారు అయ్యింది.అద్బుతమైన అందంను దక్కించుకుంది.50 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్స్‌ చేయించుకున్న ఆమె ఇప్పుడు సంవత్సరంకే కోటికి పైగా సంపాదిస్తుంది.రాబోయే రోజుల్లో ఆమె సంపాదన పదుల రెట్లు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఎందుకంటే ఆమె క్రేజ్‌ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube