కేసుపై ప్రదీప్‌ ఏమన్నాడంటే

యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు.30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ ఒక సినిమాను ప్రదీప్‌ చేస్తున్నాడు.అయితే జైలుకు వెళ్లిన వ్యక్తి హీరోగా నటించేందుకు అనర్హుడు అంటూ సునిశిత్‌ అనే ఒక దర్శకుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సినిమా గురించి ఒక్కసారిగా పతాక స్థాయిలో చర్చ మొదలైంది.అసలు సునిశిత్‌ ఎవరు, ప్రదీప్‌ ఎప్పుడు జైలుకు వెళ్లాడు అనే విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్స్‌ తెగ ఆరాటపడుతున్నారు.

 Anchor Pradeep Doing Omments On Sunishith-TeluguStop.com

Telugu Anchorpradeep, Pradeep, Pradeepdrunk, Pradeep Jail-Movie

జైలుకు వెళ్లిన వ్యక్తి హీరోగా నటించవద్దంటూ సునిశిత్‌ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన కేసుపై ప్రదీప్‌ స్పందన ఏంటా అంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు.తాజాగా ప్రదీప్‌ ఆ విషయమై స్పందించాడు.తాను జైలుకు వెళ్లినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు.అసలు తాను జైలుకు వెళ్లనే లేదు.డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్‌ తీసుకున్నాను తప్ప అమ్మాయిని వేదించిన కేసులో తాను ఎప్పుడు కూడా జైలుకు వెళ్లలేదన్నాడు.

Telugu Anchorpradeep, Pradeep, Pradeepdrunk, Pradeep Jail-Movie

ఆ కేసు పెట్టిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు అన్నాడు.కేసు పెట్టిన వ్యక్తి నాకు ఎలాంటి ఫోన్‌ చేయడం కాని, కనీసం మాట్లాడటం కూడా చేయలేదన్నాడు.సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి వార్తలు రావడం బాధగా ఉంది.

జైలుకు వెళ్లిన విషయం కనీసం నన్ను సంప్రదించకుండా మీడియాలో కథనాలు రాయడం ఏమాత్రం సమంజసం కాదంటూ ప్రదీప్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube