తమిళ డైరెక్టర్‌తో బన్నీ.. సెట్ అవుతుందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో బన్నీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

 Allu Arjun To Work With Ar Murugadoss-TeluguStop.com

ఇక ఈ సినిమా సక్సె్స్‌తో బన్నీ తన నెక్ట్స్ మూవీలను లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.

తాజాగా తన నెక్ట్స్ మూవీ డైరెక్టర్ల జాబితాలో తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగాదాస్ కూడా ఉన్నారు.

తెలుగులో రెండు స్ట్రెయిట్ సినిమాలు తీసిన ఈ డైరెక్టర్‌ తన మూడో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.దీనికి సంబంధించి ఓ అదిరిపోయే స్క్రిప్టును కూడా రెడీ చేశాడట.

గతంలో మహేష్ బాబుతో మురుగదాస్ తెరకెక్కించిన స్పైడర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేసింది.

మరి ఈసారైనా బన్నీతో మురుగదాస్ అదిరిపోయే సినిమాను తెరకెక్కిస్తాడా లేదా అనేది చూడాలి.

ఒకవేళ ఈ కాంబో నిజంగానే సెట్ అయితే వారి కాంబోలో వచ్చే సినిమా ఎలా ఉంటుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.కాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube