కరోనాతో యుద్దంకు వందల కోట్ల విరాళం

ప్రపంచ దేశాలను భయపెట్టిన చైనా ప్రస్తుతం కరోనా వైరస్‌ వల్ల భయపడుతున్న విషయం తెలిసిందే.చైనా ప్రభుత్వం ప్రస్తుతం తమ దేశాన్ని కరోనా బారి నుండి కాపాడుకునేందుకు ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కుంటుంది.

 Carona Chaina Alibaba Chief Jack Ma-TeluguStop.com

పెద్ద ఎత్తున జనాలు ఇప్పటికే మృతి చెందడటంతో పాటు వందలు వేల మందికి కరోనా వైరస్‌ ఎటాక్‌ అయినట్లుగా గుర్తించారు.వారందరికి మెరుగైన ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం చాలా పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది.

అలాగే ఆ వైరస్‌ను అడ్డుకునేందుకు కూడా చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వంకు వెన్ను దన్ను అన్నట్లుగా పలువురు చైనా కుబేరులు ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ప్రముఖ ఈకామర్స్‌ అలీబాబా అధినేత జాక్‌ మా ఏకంగా 105 కోట్ల విరాళంను చైనా ప్రభుత్వంకు అందించాడు.జాక్‌ మాత్రమే కాకుండా చైనాలో ఉన్న ప్రముఖ వ్యాపార వేత్తలు అంతా కూడా కరోనాపై యుద్దం కోసం ప్రభుత్వం వెంట నిలుస్తున్నారు.

ఇప్పటికే వేల కోట్ల విరాళాలు పోగయ్యాయి అంటూ చైనా ప్రభుత్వం ఒక ప్రకటనలో వెళ్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube