డిస్కో రాజా ఫస్ట్ వీక్ కలెక్షన్స్... ఘోరంగా దేబ్బెసిన రవితేజ

వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న మాస్ రాజ రవితేజ తాజాగా డిస్కో రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.రాజా ది గ్రేట్ తర్వాత అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయినా రవితేజ ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని భావించాడు.

 Allu Arjun Ravi Teja Sunil Payal Raj-TeluguStop.com

డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో వచ్చే కమర్షియల్ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకి వచ్చింది.అయితే సినిమా రిలీజ్ రోజు బాగుందనే టాక్ వచ్చిన మరల రొటీన్ రివెంజ్ డ్రామాని తీసుకోవడం, కొత్త కథలో అదే ఎలిమెంట్ పెట్టడంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు.

దీంతో డివైడ్ టాక్ తెచ్చుకుంది.

అయితే రవితేజ ఈ సినిమాని ఎలా అయిన నిలబెట్టాలని ప్రయత్నం చేసిన వర్క్ అవుట్ అవలేదు.

నేటికి ఈ సినిమా వారం రోజులు పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ 22 కోట్ల వరకు జరిగింది.7 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 7.84 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 14.16 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.అయితే సినిమా ఇప్పటికే దియేటర్ లో ఖాళీ అయిపొయింది.ఈ కలెక్షన్స్ విషయంలో సినిమా థియేటర్స్ దొరకకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది.పెద్ద సినిమాలు రెండు ఉండటంతో నిర్మాతలు థియేటర్స్ బ్లాక్ చేసేసారు.దీంతో తక్కువ థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చింది.

ఈ కారణంగా ఓపెనింగ్స్ డిస్కో రాజాకి దారుణంగా వచ్చాయి.ఈ ఎఫెక్ట్ ఓవరాల్ కలెక్షన్స్ మీద చూపించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube