విగ్గుకు గుడ్‌బై చెబుతున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించనున్నాడు.ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 Balakrishna To Undergo Hair Transplantation-TeluguStop.com

కాగా కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ వరుసగా వాయిదా పడుతూ వస్తోంది.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు బాలయ్య.

అందుకే ఎక్కడా ట్రాక్ తప్పకుండా ఉండేందుకు కథ విషయంలో దర్శకుడు బోయపాటి చాలా జాగ్రత్తలు పడుతున్నాడు.

కాగా ఈ సినిమాలో బాలయ్య సరికొత్త గెటప్‌లో మనకు కనిపిస్తాడు.

ఈ క్రమంలో బాలయ్య గుండు చేయించుకున్న సంగతి తెలిసిందే.అయితే బాలయ్య ఇకపై సినిమాల్లో విగ్గు వాడకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది.

దీని కోసం ఆయన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోనున్నాడట.బోయపాటి సినిమా షూటింగ్ మొదలు కాకముందే ఆయన దుబాయ్‌కు వెళ్లనున్నట్లు, అక్కడ ఈ ట్రీట్‌మెంట్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య విగ్గులు లేకుండా చేస్తున్నాడనే వార్తతో ప్రస్తుతం నందమూరి ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక బోయపాటి సినిమాలో హీరోయిన్‌ ఎవరనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ సినిమాను మిర్యాల రవీందర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube