సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీని వీడుతారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతూ వస్తున్నా ఆయన ఆ పార్టీలోనే ఉంటూ వచ్చారు.జనసేన పార్టీ బిజెపి తో పొత్తు పెట్టుకోవటంతో గతంలో ఆయన బిజెపిలో చేరబోతున్నారనే ఊహాగానాలకు తెరపడింది.
బీజేపీ సపోర్ట్ కూడా జనసేనకు దక్కడంతో ఇక మరింత యాక్టివ్ గా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారని అంతా అనుకున్నారు.అశ్వాలు ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో సొంతంగా పార్టీ పెడతారని, రైతు సమస్యల మీద ప్రధానంగా దృష్టిపెడతాను అని చెప్పాడు.
ఇక ఆ తర్వాత పరిణామాల్లో ఆయన జనసేనలో చేరడం, విశాఖ ఎంపీ గా పోటీ చేయడం, అక్కడ ఓటమి చెందడంతో ఆయన రాజకీయ జీవితానికి పులిస్టాప్ పడింది.
ఆ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ గట్టిపోటీనే ఇచ్చారు.ఇక అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సొంతంగా కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూ విశాఖలోనే ఉంటున్నారు.గత రెండు మూడు నెలల నుంచి ఆయన జనసేన పై ఆగ్రహంగా ఉన్నారని, పార్టీని వీడుతారనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
కొద్ది రోజుల క్రితం బిజెపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న సందర్భంగా అసలు తనకు ఒక్క మాట కూడా చెప్పలేదని ఆయన అసహనంతో ఉంటూ వస్తున్నారు.ఇక పవన్ కూడా లక్ష్మీనారాయణను పెద్దగా పట్టించుకోవడం మానేశారు.
ప్రస్తుతం జనసేన బిజెపి పొత్తు పెట్టుకున్న కారణంగా తాను జనసేన లో ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ సీటు బిజెపికి దక్కుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.
తాను ఈ పార్టీలో ఉన్నా ప్రయోజనం లేదనే ఆలోచనకు వచ్చిన ఆయన జనసేన కు రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతారు అనేది హాట్ టాపిక్ గా మారింది.వైసీపీలో ఎలాగు చేరలేరు.
బిజెపి జనసేన పొత్తు కారణంగా బీజేపీలోకి వెళ్ళలేరు.ఈ పరిస్థితుల్లో ఆయనకు ఒకే ఒక్క ఆప్షన్ గా తెలుగుదేశం పార్టీ ఉంది.
ఈ మేరకు టిడిపి నేతలు కూడా కొంతమంది ఆయనను పార్టీలో చేరాల్సిందిగా రాయబారాలు నడుపుతున్నట్టు, వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు ఇస్తామని ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తోంది.మరికొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.