రాబర్ట్ వాద్రా మనీలాండరింగ్ కేసు: ఎన్ఆర్ఐకి బెయిల్ మంజూరు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మనీలాండరింగ్ కేసులో ఎన్ఆర్ఐ, వ్యాపారవేత్త సీసీ.తంపికి ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.

 Nri Businessman Gets Bail In Money Laundering Case-TeluguStop.com

స్పెషల్ జడ్జి అరవింద్ కుమార్.తంపీకి రూ.5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరి హామీతో బెయిల్ మంజూరు చేశారు.

బ్రిటన్ రాజధాని లండన్‌లోని 12, బ్రయాన్ స్టోన్ స్క్వేర్‌లో 1.9 మిలియన్ పౌండ్లు (సుమారు 17.77 కోట్ల) విలువైన ఆస్తిని కొనుగోలు చేసే వ్యవహారంలో రాబర్ట్ వాద్రా మనీలాండరింగ్‌కు పాల్పడ్డట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తోంది.బ్రయాన్‌స్టోన్‌లోని భవనంతో పాటు 4 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.37.42 కోట్లు) విలువైన మరో రెండు ఆస్తులు, 5 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.46.77 కోట్లు) విలువైన మరో రెండు ఆస్తులు మొత్తం ఆరు భవనాలు వాద్రాకు ఉన్నాయని ఈడీ భావిస్తోంది.వీటన్నింటి విలువ రూ.వందకోట్లకు పైనే ఉంటుందని అంచనా.

Telugu Nri Businessman, Telugu Nri-

ఈ కేసులో భాగంగా జనవరి 18న ఎఆర్ఐ వ్యాపారవేత్త తంపిని ఈడీ అరెస్ట్ చేసింది.ఆయన దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైలైట్‌ కంపెనీతో వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు.ఇదే కేసులో 2009లో మరొక సహ నిందితుడు సంజయ్ భండారి సంస్థ శాంటెక్ ఎఫ్‌జె‌డ్‌ఈ లండన్‌లోని ఈ ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థ నుంచి కొనుగోలు చేసింది.

Telugu Nri Businessman, Telugu Nri-

కాగా ఈ కేసులో భాగంగా వాద్రా గతేడాది ఫిబ్రవరి 6న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు.ఈ సందర్భంగా తనకు లండన్‌లో ఎలాంటి ఆస్తులు లేవని రాబర్ట్ వాద్రా తెలిపినట్లుగా తెలుస్తోంది.ఇదే సమయంలో ఈ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి పనులు చక్కబెట్టిన మనోజ్ ఆరోరా గురించి అధికారులు వాద్రాను ప్రశ్నించగా.ఆయన తన వద్ద గతంలో ఉద్యోగం చేశారని వాద్రా తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube