పొలం పనులకు శ్రీకారం చుట్టిన శర్వా

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్, అన్నట్లుగానే కొన్ని నిమిషాల ముందు ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

 Sharwanand Sreekaram First Look Poster Released-TeluguStop.com

ఈ చిత్రం పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుందనే విషయం మనకు ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది.

‘ఇతను మన కేశవుల కొడుకు.

పొద్దున్నే పొలం పనికి వెళ్తున్నాడు చూడిండి’ అంటూ యూనిట్ శర్వా ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.ఈ సినిమాతో మరోసారి శర్వానంద్ తనదైన మార్క్ వదులుతాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో శర్వా సరసన ఆరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ అమ్మడు గతంలో నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించింది.

Telugu Poster, Sharwanand, Sreekaram, Telugu-Movie

వీరిద్దరి మధ్య నడిచే అందమైన లవ్ ట్రాక్ అందరి మనసుల్ని దోచుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాను కిషోర్.బి డైరెక్ట్ చేస్తుండగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube