స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.
దీంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు.
సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో అదిరిపోయే కలెక్షన్లు రాబడుతూ దూసుకెళుతోంది.
ఇప్పటికే ఈ సినిమా పలు ప్రాంతాల్లో నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది.కాగా ఈ సినిమా రెండు వారాలు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.134.13 కోట్ల షేర్ కలెక్షన్లు సాధించింది.ఈ సినిమా టోటల్ రన్లో ఎంతమేర వసూళ్లు రాబడుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు బలం చేకూర్చింది.
ఇక ఏరియాల వారీగా ఈ చిత్రం రెండు వారాల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజం – 35.10 కోట్లు
సీడెడ్ – 17.16 కోట్లు
నెల్లూరు – 3.86 కోట్లు
కృష్ణా – 8.40 కోట్లు
గుంటూరు – 9.06 కోట్లు
వైజాగ్ – 17.80 కోట్లు
ఈస్ట్ – 9.50 కోట్లు
వెస్ట్ – 7.22 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 108.10 కోట్లు
కర్ణాటక – 9.15 కోట్లు
కేరళ – 1.18 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 3.55 కోట్లు
యూఎస్ – 12.15 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు – 134.13 కోట్లు
.