ఆసియా కప్‌కు రాకుంటే వరల్డ్‌ కప్‌కు వచ్చేది లేదన్న పాక్‌

ఇండియా పాకిస్తాన్‌ల మద్య మద్య క్రికెట్‌ అంటే ఇరు దేశాల ప్రేక్షకులు కూడా యుద్దం కంటే ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు.అందుకే ఇరు దేశాల మద్య ఎక్కువ మ్యాచ్‌లు ఆడించేందుకు రెండు దేశాల క్రికెట్‌ బోర్డులు ప్రయత్నాలు చేస్తుంటాయి.

 Pakistan Will Not Come To World Cup If It Does Not Come To Asia Cup-TeluguStop.com

కాని దేశాల ప్రభుత్వాలు మాత్రం క్రికెట్‌పై ఆంక్షలు పెడుతూ ఉన్నాయి.ఇండియా దాదాపు 15 ఏళ్లుగా పాకిస్తాన్‌ టూర్‌కు వెళ్లలేదు.

అప్పటి నుండి కూడా పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడలేదు.

త్వరలో ఆసియా కప్‌ జరుగబోతుంది.

అది పాకిస్తాన్‌లో ఐసీసీ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే.పాకిస్తాన్‌లో జరుగబోతున్న ఆ సిరీస్‌లో పాల్గొనే విషయమై భారత్‌ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

బీసీసీఐకి భారత ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు ఇంకా రాలేదు.దాంతో ఆసియా కప్‌లో ఇండియా ఆడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది ఇండియాలో జరుగబోతున్న టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు పాకిస్తాన్‌ వచ్చేది లేదు అంటూ ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.ఒకవేళ ఆసియా కప్‌ కోసం పాకిస్తాన్‌కు ఇండియా రాకుంటే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం తాము ఇండియాకు వెళ్లబోము అంటూ తేల్చి చెప్పింది.

ఇండియాకు పాకిస్తాన్‌ రాకుంటే చాలా నష్టం జరుగుతుంది.అందుకే ఇండియా ఆసియా కప్‌లో పాల్గొనడమే మంచిదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube