ఇక ఉరే, త్వరలో ఉరి, అతి త్వరలో ఉరి... ఇంకా ఎన్ని రోజులు ఇలా?

పదేళ్లు దాటుతున్నా కూడా నిర్భయ దోషులకు ఉరి మాత్రం పడటం లేదు.నిర్భయ నింధితులు కాస్త దోషులుగా తేలి వారికి ఉరి శిక్ష పడి చాలా ఏళ్లు అవుతుంది.

 How Many Times Post Pone Nirbhaya Victims Viral In Social Media-TeluguStop.com

అయినా కూడా ఇప్పటి వరకు అసలు ఏదో ఒక కారణం చెబుతూ ఉరి శిక్షను వాయిదా వేస్తూ ఉన్నారు.కొన్ని సార్లు దోషులు వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌, పవన్‌ గుప్తలు ఏదో ఒక పిటీషన్‌ వేయడం లేదంటే అనారోగ్య కారణాలు చెబుతూ ఉరిని వాయిదా వేసేలా చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం ఉరి ఖాయం అంటూ అంతా అనుకున్న సమయంలో మళ్లీ కోర్టుకు వెళ్లిన దోషులు తమకు క్షమాభిక్ష కోరేందుకు సరైన పత్రాలను జైలు అధికారులు ఇవ్వడం లేదు అంటూ ఫిర్యాదు చేశారు.

రెండు రోజులు ఆ విషయమై విచారించిన కోర్టు చివరకు జైలు అధికారులు ఇచ్చిన పత్రాలతో సంతృప్తి చెందారు.

ఉరిని తప్పించుకునేందుకు మీరు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారంటూ దోషులపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన మీరు ఇన్నాళ్ల పాటు జీవించి ఉండటమే ఎక్కువ.

అలాంటిది మీకు ఇంకా క్షమాభిక్ష ఎందుకు అంటూ మహిళా లోకం దోషులను వెంటనే ఉరి తీయాలంటూ డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో అతి త్వరలోనే వారికి ఉరి పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

అయితే మీడియాలో చాలా రోజులుగా ఇక ఉరే, త్వరలో వారికి ఉరి అతి త్వరలో వారు ఉరికంబం ఎక్కబోతున్నారు అంటూ కథనాలు వస్తున్నాయి.కాని ఇప్పటి వరకు మాత్రం ఉరి తీయలేదు.

ఇప్పటికైనా నిర్భయ దోషులను ఉరి తీసి నిర్భయ ఆత్మకు శాంతి కలిగేలా చేయాలని ఆమె సన్నిహితులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube