ఆడవాళ్ళ కోసం రాజ్యాలు పోగొట్టుకున్న రాజులు ఉన్నారు.అదే ఆడవాళ్ళని గెలుచుకోవడం ఒకరికి ఒకరు తలపడ్డవారు ఉన్నారు.
చరిత్రలో చాలా యుద్ధాలు ఆడవాళ్ళ వలెనే వచ్చాయని త్రివిక్రమ్ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ కచ్చితంగా కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే గుర్తుకొస్తుంది.ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన ఘటన జరిగింది.
అమ్మాయి కోసం రోడ్డు మీద కొట్టుకున్న అబ్బాయిలని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.అయితే ఇలాంటి గొడవలకి తాము ఏ మాత్రం అతీతులు కామని జంతువులు కూడా అప్పుడప్పుడు నిరూపిస్తూ ఉంటాయి.
తాజాగా ఓ ఫారెస్ట్ లో ఆడసింహం కోసం రెండు మగ సింహాలు పోట్లాడుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒకదానితో ఒకటు ద్వంద్వ యుద్ధానికి దిగాయి.
ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి.రెండు సింహాలు పైచేయి సాధించడానికి ప్రయత్నం చేశాయి.
చివరికి ఓ సింహం అలసిపోయి ఒక పోరాడలేక అక్కడి నుంచి తోక ముడుచుకొని జారుకుంది.విజయం సాధించిన దర్జాగా ఆడ సింహం దగ్గరకి వెళ్ళింది.
ఐఏఎఫ్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో ‘కింగ్ వర్సెస్ కింగ్, ఓన్లీ ఫర్ ఏ క్వీన్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు విధా అయిపోయారు.
వీడియోను విపరీతంగా షేర్ చేశారు.దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యింది.
ఈ వీడియో చూసిన వారు ఆడవాళ్ళ కోసం యుద్ధాలు మనుషుల్లో మగాళ్ళ మధ్యనే కాదు ఇలా సింహాల మధ్య కూడా జరుగుతాయన్న మాట అని కామెంట్స్ పెడుతున్నారు.