కేసీఆర్‌ వ్యూహంతో విమానం కన్నా స్పీడ్‌గా దూసుకు పోతున్న కారు

తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే ఫలితాలపై ఒక స్పష్టత వచ్చింది.

 Kcr Plan Trs Win Telangana Muncipality Elections-TeluguStop.com

రాష్ట్రంలోని మెజార్టీ మున్సిపాలిటీల్లో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ జెండా పాతింది.కీలకమైన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీలను సైతం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది.

మొత్తం 120 మన్సిపాల్టిలు మరియు 9 కార్పోరేషన్‌లలో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయ దుందుబీ మోగిస్తుంది.

ఎన్నికలకు ముందు రెండు మూడు సార్లు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మరియు మంత్రులను పిలిపించుకుని సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చారు.

మీకు అప్పగించిన మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి పాలయితే మీకు రాజకీయ భవితవ్యం ఉండదు.మీకు ఈ ఎన్నికలు చావో రేవో అంటూ హెచ్చరించడంతో చాలా మంది ఎమ్మెల్యేలు మరియు మంత్రులు కంటికి నిద్ర లేకుండా కష్టపడ్డారు.

అభ్యర్థుల ఎంపిక విషయం నుండి ఓటింగ్‌ రోజు వరకు చాలా కష్టపడ్డారు.ఇప్పుడు ఆ ఫలితమే ఈ రిజల్ట్‌ అంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు.అలా కేసీఆర్‌ వ్యూహంతో కారు చాలా స్పీడ్‌గా దూసుకు పోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube