టిఆర్ఎస్ ఖాతాలో పడిన మున్సిపాలిటీలు ఇవే

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ టాప్ గేర్ లో దూసుకుపోతోంది.గత అసెంబ్లీ ఫలితాల్లో ఏ విధంగా అయితే కారు జోరు కనిపించిందో ఇప్పుడు అదే మున్సిపల్ ఎన్నికలల్లోనూ టిఆర్ఎస్ పార్టీ అదే దూకుడు కనబరుస్తోంది.

 Trs Won Telangana Muncipality Seats Details-TeluguStop.com

ముఖ్యంగా తెలంగాణలోని మరిపెడ, ధర్మపురి,కొత్తపల్లి, చెన్నూరు, పరకాల, బాన్సువాడ అలాగే పెద్దపల్లి మున్సిపాలిటీలను టిఆర్ఎస్ సొంతం చేసుకుంది.మరిపెడలో మొత్తం అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ కేలీన్ స్వీప్ చేసి సరికొత్త రికార్డును టిఆర్ఎస్ పార్టీ నెలకొల్పింది.

ధర్మపురి మున్సిపాలిటీ, పెద్దపల్లి మున్సిపాలిటీ లో టిఆర్ఎస్ దక్కించుకుంది.మొదటి నుంచి ఈ అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుంది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

Telugu Telangana Trs, Sirisilla Trs, Trs Bjp, Trswon, Trs Ktr-Political

ఇప్పుడు ఈ ఫలితాలతో ఆయన అంచనా నిజమైంది.పట్టణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీపై సంతృప్తిగా ఉన్నారని విషయం అర్థమైంది అంటూ టిఆర్ఎస్ శ్రేణులు ఆనందంగా చెబుతున్నాయి.కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల మాత్రం స్వతంత్ర అభ్యర్థుల హవా కొనసాగింది.ఇక్కడ స్వతంత్రులు సుమారు పదిమంది వరకు గెలిచారు.39 వార్డులకు ఓట్ల లెక్కింపు ముగియగా టీఆర్‌ఎస్‌ 24 వార్డుల్లో గెలిచింది.బీజేపీ 3, కాంగ్రెస్‌ 2 స్థానాలు దక్కించుకోగా, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు.

సిరిసిల్లలో మొత్తం వార్డులన్నీ టీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు భావించారు.కానీ అనూహ్యంగా స్వతంత్రులు 10 మంది గెలుపొందారు.

Telugu Telangana Trs, Sirisilla Trs, Trs Bjp, Trswon, Trs Ktr-Political

ఇక రాష్ట్ర వ్యాప్తంగా కారు పార్టీ పార్టీ జోరు మీద ఉండడంతో ఎక్కడలేని సంతోషంలో ఉన్న టీఆర్ఎస్.ఇక ముందు ముందు కూడా ఇదే రకమైన వ్యూహాలతో ముందుకు వెల్తూ తమకు ఎదురు లేకుండా చేసుకోవాలని చూస్తోంది.ఇక తెలంగాణ లో కాంగ్రెస్ బలహీనపడిన క్రమంలో బీజేపీ బాగా పుంజుకుంటుందని అంతా అంచనా వేయగా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ విజయఢంకా మోగించడం గులాబీ పార్టీలో ఆనందాన్ని కలిగిస్తోంది.ఇక ఈ ఫలితాలతో కేటీఆర్ సామర్ధ్యం ఏంటో తెలిసిందని ఇక ఆయనకు సీఎంగా పట్టాభిషేకమే మిగిలి ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube