'డిస్కోరాజా' ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా?

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ చిత్రం డిస్కోరాజా.ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

 Ravi Teja Payal Raj Anand-TeluguStop.com

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు అనుకున్నట్లుగానే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.దాంతో అన్ని ఏరియాల్లో కూడా కలెక్షన్స్‌ పాజిటివ్‌గా వస్తున్నాయి.

సినిమా మొదటి రోజు దాదాపుగా 80 శాతం ఆక్యుపెన్సీని దక్కించుకున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మొదటి రోజు ఈ సినిమా అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా 6.5 కోట్ల షేర్‌ను రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది.ఈ మద్య కాలంలో రవితేజ మూవీ ఈ స్థాయి ఓపెనింగ్స్‌ను దక్కించుకోవడం చాలా గొప్ప విషయంగా ఆయన అభిమానులు అంటున్నారు.

అతి త్వరలోనే ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ను సాధిస్తుందని సినీ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు.అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రంను 22 కోట్లకు అమ్మినట్లుగా తెలుస్తోంది.

Telugu Anand, Discoraja, Payal Raj Puth, Ravi Teja, Tollywood Box-Latest News -

ఈ వీకెండ్‌లో సినిమా 12 నుండి 15 కోట్ల వరకు రాబట్టే ఛాన్స్‌ ఉంది.అంటే మొదటి వారం తర్వాత సినిమా లాభాల బాట పట్టడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రవితేజకు ఈ చిత్రం చాలా బూస్ట్‌ ఇచ్చిందని, తప్పకుండా ముందు ముందు రాబోతున్న సినిమాలకు ఇది ఒక మంచి మెట్టుగా ఉంటుందని రవితేజ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube