బన్నీని ఈ విషయంలో అభినందించకుండా ఉండలేం

యాక్షన్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ వంటి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తల్లి సీతారావమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెల్సిందే.బోయపాటి తల్లి మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగి పోయారు.

 Balakrishna Allu Arjun Boyapati Srinu Balakrishna Pedakakani-TeluguStop.com

ఇండస్ట్రీ ముఖ్యలు పలువురు బోయపాటితో మాట్లాడి ఆయన్ను కలిసి సంతాపం తెలియజేయడం జరిగింది.గుంటూరు జిల్లా పెద్దకాకానిలో ఆమె అంత్యక్రియలు చేయడంతో పాటు నిన్న పెద్ద కర్మ కూడా అక్కడే నిర్వహించారు.

పెద్ద కర్మ కార్యక్రమంలో ఇండస్ట్రీ నుండి అల్లు అర్జున్‌ హాజరు అవ్వడం చర్చనీయాంశం అయ్యింది.బోయపాటి కోసం ప్రస్తుతం ఉన్న పనులు అన్ని వదిలేసి పెద కాకాని వెళ్లడం ఆశ్చర్యంగా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

బోయపాటి తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ బన్నీ బోయపాటి శ్రీనుకు సానుభూతి తెలియజేశాడు.దాదాపు గంట పాటు అక్కడే ఉన్న బన్నీ బోయపాటి కుటుంబ సభ్యులందరిని కూడా ఓదార్చాడు.

Telugu Allu Arjun, Balakrishna, Boyapati Srinu, Bunny, Pedakakani-Latest News -

వీరిద్దరి కాంబోలో సరైనోడు వచ్చిన విషయం తెల్సిందే.తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ చిత్రాల జాబితాలో సరైనోడు ముందు వరుసలో ఉంటుంది.అలాంటి సక్సెస్‌ ఇచ్చిన బోయపాటి కష్టాల్లో దుఖంలో ఉన్న విషయం తెలుసుకున్న బన్నీ వెంటనే దూరం అయినా అక్కడ వాలి పోయాడు.అందుకే బన్నీని ఈ విషయంలో అభినందించకుండా ఉండలేం అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube