రజినీకాంత్‌ సినిమాపై నిజం తేల్చిన కోర్టు

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించే కొన్ని సినిమాలు సామాజిక అంశాలను కలిగి ఉండటంతో వాటిని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు.ఇలాంటి చిత్రాల్లో లింగా కూడా ఒకటి.

 Rajani Kanth Linga Tamilnadu Rockline Venkatesh-TeluguStop.com

దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2014లో రిలీజ్ అయ్యి మంచి హిట్‌గా నిలిచింది.అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో రవిరత్నం అనే దర్శకుడు తన సినిమా కథను కాపీ చేశారంటూ లింగా చత్ర యూనిట్‌పై కోర్టులో కేసు వేశారు.

మద్రాస్ కోర్టు రూ.10 కోట్ల ఇన్సూరెన్స్ మీద లింగా సినిమాను రిలీజ్ చేసుకోవాలని చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌కు సూచించింది.కాగా ఈ సినిమా కేసును విచారణ జరిపిన కోర్టు, తాజాగా తీర్పును వెలువరించింది.లింగా చిత్ర కథ రవిరత్నం తెరకెక్కించిన ‘ముల్లైవానమ్ 999’ సినిమా నుండి కాపీ కొట్టింది కాదని కోర్టు తేల్చింది.

దీంతో లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌కు ఊరట లభించిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.కెఎస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కేసుపై కోర్టు తీర్పుతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు.

కాగా రజినీ తాజాగా దర్బార్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన సత్తాను మరోసారి చూపించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube