మగాళ్లు మీకు జోహార్లు : ఆ పాతిక సంవత్సరాలు మగవారు పడే కష్టం పగవాడికి కూడా రావద్దు

ఎఫ్‌ 2 సినిమాలో ఒక డైలాగ్‌ ఉంటుంది.ఇన్ని కష్టాలు పడుతూ ఎలా సంతోషంగా ఉంటున్నారు.

 Survey Report About Man-TeluguStop.com

మగాళ్లు మీరు గ్రేట్‌.నిజంగానే ఈ డైలాగ్‌ మగాళ్లకు వర్తిస్తుందని అమెరికన్‌ యూనివర్శిటీ ఒక సర్వేలో తేల్చింది.

అమెరికాలోని దాదాపు అయిదువేల మంది మగాళ్లను వేరు వేరు ప్రాంతాల నుండి ఎంపిక చేసుకుని వారిని ప్రశ్నించడం జరిగింది.వివిధ వయసుల వారిని ప్రశ్నించిన నిపుణులు ఆశ్చర్యకర విషయాన్ని తెలుసుకున్నారు.

మగవాళ్లు పడుతున్న బాధలు చూసి పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదురా బాబోయ్‌ అనుకున్నారట.ఆ సర్వే రిపోర్ట్‌ వచ్చిన తర్వాత సగటు మగాడు నిజమే కదా అనుకుంటున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్లే.శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకున్న వారిని పలు ప్రశ్నలు వేయడం ద్వారా వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు.పాతిక సంవత్సరాల లోపు వారి మానసిక పరిస్థితి చక్కగా ఉంది.వారు చాలా ఉల్లాసంగా జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూ ఉన్నారు.

పాతిక సంవత్సరాలు దాటిన వారు ఏమాత్రం సంతోషంగా లేరు.వారి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

మెంటల్‌గా వారు చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు.పాతిక నుండి యాబై ఏళ్ల మద్య వయస్కులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొన్నారు.

Telugu Age, Telugu Ups-General-Telugu

ఆ పాతికేళ్లు మగాళ్లకు అనేక బాధ్యతలు, కష్టాలు, బంధాలు ఉంటాయి.ఆ సమయంలోనే కొత్తగా పెళ్లి భార్య పిల్లలు వారి పోషణ ఇలా ఎన్నో బాధ్యతలు నెత్తిన పెట్టుకుంటారు.ఇక ఉద్యోగ భారంను చాలా బారంతో మోస్తున్న వారు చాలా మంది ఉంటారు.కొత్త ఉద్యోగాలు అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్నారు.50 ఏళ్ల వరకు కూడా కుటుంబం, పిల్లలు, ఉద్యోగం, బాధ్యతలు ఇలాంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు.

Telugu Age, Telugu Ups-General-Telugu

ఎప్పుడైతే 50 ఏళ్లు క్రాస్‌ చేస్తున్నారో అప్పుడు మగాళ్లు మళ్లీ రిలాక్స్‌ అవుతున్నారట.ముసలి వయసుకు వచ్చినప్పటికి ఉద్యోగం చేసినా కూడా కాస్త బాధ్యతలు తక్కువ ఉంటాయి, ఆఫీస్‌లో ఒత్తిడి తగ్గుతుంది.పిల్లలు పెద్ద వారు అయ్యి ఎవరి పనుల్లో వారు బిజీ అవుతారు.

జీవిత భాగస్వామి కూడా మొదట్లో ఉన్నంత భారంగా ఉండదట.దాంతో 50 ఏళ్ల తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.

మొత్తానికి మద్యలో వచ్చే ఆ పాతిక యేళ్ల జీవితమే చాలా భారంగా సాగుతుందని ఆ సమయంలో చనిపోవాలనే ఆలోచన చేసి కుటుంబం మరియు బాధ్యతల కారణంగా వెనక్కు తగ్గే వారు కూడా చాలా మంది ఉన్నారు.అందుకే మగాళ్లు మీకు జోహార్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube