మండలి రద్దు నిర్ణయంపై సొంత పార్టీలో కూడా వ్యతిరేకత

చేతికి చిన్న జబ్బు చేసిందని పూర్తి చేయిని నరికేసుకున్నట్లుగా జగన్‌ పరిస్థితి ఉంది అంటూ వైకాపా నాయకులు కొందరు అనదికారికంగా పైకి అనకుండా లో లోపల అంటున్నారు.ప్రస్తుతానికి మండలిలో బలం లేదని, భవిష్యత్తులో మండలిలో వైకాపా సభ్యులు పెరుగుతారని తెలిసినా కూడా జగన్‌ అవివేకంతో ఆనాలోచితంగా మండలిని రద్దు చేసే యోచన చేస్తున్నట్లుగా వైకాపా నాయకులు అంటున్నారు.

 Opposition Within The Own Party Over The Decision To Dissolve The Council-TeluguStop.com

మండలి ఉండటం వల్ల ఎమ్మెల్యేలు కాని రాజకీయ పండితులు పెద్దల సభలో ఉండవచ్చు.ఆ విషయాన్ని గతంలో జగన్‌ తండ్రి వైఎస్‌ఆర్‌ నిరూపించాడు.

రాజశేఖర్‌ రెడ్డి ఎంతో ఆలోచించి తీసుకు వచ్చిన మండలిని మళ్లీ ఇప్పుడు రద్దు చేయడం జగన్‌ అవివేక అనాలోచిత నిర్ణయం తప్ప మరేం లేదు అని, ఇప్పుడు రాజధాని బిల్లును మండలి తిరష్కరించిందని మండలినే రద్దు చేయడం అనేది కరెక్ట్‌ కాదు.మండలిలో బిల్లు పాస్‌ కాకున్నా కూడా అనేక మార్గాల్లో బిల్లులను పాస్‌ చేసుకునే లొసుగులు చట్టాల్లో ఉన్నాయి.

వాటిని ఉపయోగించుకోవాలే తప్ప రాజకీయ నిరుద్యోగులకు అండగా ఉండే మండలిని రద్దు చేయడం ఏంటంటూ కొందరు గుణుగుతున్నారు.కాని వారు జగన్‌ ముందు ధైర్యంగా వెళ్లి ఈ విషయాన్ని చెప్పలేరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube