ఇన్నాళ్లు నవ్వించాడు, ఇప్పుడు ఏడ్పిస్తాడట

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఏం చేసినా నవ్వే వస్తుంది.ఆయన విలన్‌గా నటించాలనుకున్న నవ్వే వస్తుంది, డాన్స్‌ చేసినా నవ్వే వస్తుంది.

 The Humorous Brahmananda Rangamarthanda-TeluguStop.com

చివరకు యాడ్‌లో నటించినా కూడా నవ్వు తెప్పించే విధంగానే నటించాడు.అలా బ్రహ్మానందం ఇప్పటి వరకు కన్నీళ్లు వచ్చేలా నవ్వించాడే తప్ప ఎప్పుడు కూడా ఎమోషనల్‌గా కన్నీళ్లు వచ్చేలా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

అప్పట్లో బాబాయి హోటల్‌ చిత్రంలో కాస్త సీరియస్‌ పాత్రను చేసినా కూడా అది పూర్తి స్థాయి పాత్ర కాదు.కొద్ది సమయం అది కూడా మరీ ఎమోషనల్‌ ఏమీ కాదు.

అందుకే ఇప్పుడు బ్రహ్మానందం ప్రేక్షకులను కన్నీరు పెట్టించేందుకు అది కూడా ఎమోషనల్‌గా కన్నీరు పెట్టించేందుకు రాబోతున్నాడు.

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగమార్తాండ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్‌ అందరి అంచనాలు పెంచేసింది.ఇప్పటి వరకు చూసిన బ్రహ్మానందం మాదిరిగా కాకుండా విభిన్నమైన బ్రహ్మానందంగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు అని ఫస్ట్‌లుక్‌తోనే అర్థం అయ్యింది.

భారీ ఎత్తున అంచనాలున్న రంగమార్తాండ చిత్రంలో బ్రహ్మానందం సీన్స్‌ ప్రతి ఒక్కరిని కదిలిస్తాయని, ఆయన నటనకు ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకుంటారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.కమెడియన్‌గా అత్యున్నత స్థాయికి వెళ్లిన బ్రహ్మానందం ఇకపై ఇలాంటి పాత్రలు చేస్తాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube