గ్రహణం రోజు సూర్యుడిని చూసిన యువకులు... కంటి చూపు మాయం

సూర్యగ్రహణం రోజు ఎలాంటి ఉపకరణాలు లేకుండా నేరుగా సూర్యుడుని చూడకూడదని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు.నేరుగా సూర్యుడిని చూస్తే కళ్ళు దెబ్బ తినే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉంటారు.

 15 Youngsters In Jaipur Suffer Vision Loss Due To Solar Eclipse-TeluguStop.com

సూర్యగ్రహణం రోజు విడుదలయ్యే కాంతి కిరణాలు అత్యంత అతినీలలోహిత కిరణాలు రిలీజ్ అవుతాయని, ఇవి కళ్ళ మీద విపరీతమైన ప్రభావం చూపించి కళ్ళు పోయేలా చేస్తాయని చెబుతూ ఉంటారు.అయితే డాక్టర్లు చెప్పే ఇలాంటి మాటలని కొట్టేసి కొంత మంది కావాలని సూర్యగ్రహణం రోజు సూర్యుడిని చూసే ప్రయత్నం చేస్తారు.

ఇప్పుడు అలాగే రాజస్థాన్ లో 15 మంది యువకులు గ్రహణం రోజు సూర్యుడిని చూసారు.ఎలాంటి పరికరాలు లేకుండా ఇలా చూడటం వలన ఇప్పుడు వారు శాశ్వతంగా గుడ్డివాళ్ళుగా మారిపోయారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.డిసెంబరు 26న ఆకాశంలో ఆవిష్కృతమైన సూర్యగ్రహణాన్ని 15మంది యువకులు ధైర్యంగా నిపుణులు చెప్పే విషయం వాస్తవం కాదని నిరూపించడానికి వట్టి కళ్లతో సూటిగా చూశారు.

దీంతో వారి కంటిలోని రెటీనా మాడిపోయి కంటి చూపు భాగా దెబ్బతింది.అసలు ఎం జరిగిందో అర్ధం కాక వారు హాస్పిటల్ కి వెళ్ళారు.

హాస్పిటల్ లో డాక్టర్లు పరిశీలించి కేవలం సూర్యగ్రహణం రోజున సూర్యుడిని నేరుగా చూడటం వలెనే కళ్ళు పోయాయని నిర్ధారించారు.భవిష్యత్తులో కూడా వారి చూపు వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube