తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్.. తరలివస్తున్న సినీ ఇండస్ట్రీ

తమిళ స్టార్ బ్యూటీ అమలా పాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.తమిళ ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేసుకున్న ఈ హీరోయిన్ తండ్రి పాల్ వర్గీస్ కన్నుమూశారు.61 ఏళ్ల వయుసున్న ఆయన గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.కొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

 Amala Paul Father Passes Away-TeluguStop.com

అమలా పాల్ తండ్రి మరణ వార్తతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.పలువురు సినీ ప్రముఖులు ఆమె తండ్రి మృతిపట్ల తీవ్ర సంతాపం తెలిపారు.

తన కూతురు సినిమాల్లో నటించడం అస్సలు ఇష్టం లేని పాల్ వర్గీస్‌ను అమలా పాల్ ఒప్పించి మరీ ఈ స్థాయికి చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా ఆమె వైవాహిక జీవితం పట్ల పాల్ వర్గీస్ చాలా ఆందోళన చెందేవారని తెలుస్తోంది.

అమలా పాల్ తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.ఆమె తండ్రి మరణవార్తతో అమలా పాల్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

కాగా బుధవారం సాయంత్రం కురుప్పంపాడులో పాల్ వర్గీస్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube