ఆర్ఆర్ఆర్‌లో అజయ్ దేవ్గన్ పాత్ర ఇదేనా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులపై మరోసారి రాజమౌళి కన్నేశాడు.

 Ajay Devgn Bhagat Singh Rrr-TeluguStop.com

ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ నటీనటులు కూడా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో అజయ్ దేవ్గన్‌ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో అజయ్ దేవ్గన్ జాయిన్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ పాత్ర ఏమిటా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఆయన చేయబోయే పాత్ర సినిమాకు హైలైట్ కానుందని తెలుస్తోంది.స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పాత్రలో అజయ్ దేవ్గన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పాత్రలో అజయ్ దేవ్గన్ తప్ప మరే హీరో న్యాయం చేయలేరని రాజమౌళి అండ్ టీమ్ అంటున్నారు.అక్టోబర్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి ఈ సినిమాలో భగత్ సింగ్ పాత్రలో అజయ్ దేవ్గన్ ఎలా కనిపిస్తాడో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.కాగా కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube