సర్వే రిపోర్ట్‌ : స్మార్ట్‌ ఫోన్‌తో విద్యార్థులకు కొత్త కష్టం వచ్చింది తెలుసా?

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ ఫోన్‌లు అనేవి సర్వసాదారణం అయ్యాయి.పిల్లల నుండి ముసలి వారి వరకు కూడా స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకుని గంటలు గంటలు కాలక్షేపం చేస్తున్నారు.

 Students Who Is Using Much Time With Smart Phone-TeluguStop.com

ముసలి వాళ్లకు టైం పాస్‌ అనుకుంటే పిల్లలు మరియు యువకులు స్మార్ట్‌ ఫోన్‌తో టైంను వృదా చేస్తున్నారు.ఇది అత్యంత దారుణమైన విషయం అంటూ పలు సర్వేలు వెళ్లడించాయి.

అనేక సర్వేల రిపోర్ట్‌ల ప్రకారం యువకులు తమ టైంలో కనీసం 10 శాతం అయిన స్మార్ట్‌ ఫోన్‌కు కేటాయిస్తున్నారట.

మామూలు సమయంలో స్మార్ట్‌ ఫోన్‌తో ఎక్కువ సమయం గడిపే విద్యార్థులు పరీక్షలు ప్రారంభం అవ్వగానే స్మార్ట్‌ ఫోన్‌ పక్కన పెట్టి చదువుకోవాలనుకుంటారు.

చాలా మంది చదువుతూ ఉంటారు.ఆ వారం పది రోజులు లేదా ఆ పదిహేను రోజులు ఫోన్‌ను పూర్తిగా పక్కకు పెట్టి చదువుపై దృష్టి పెట్టాలనుకుంటారు.కొందరు పెట్టగలరు, కొందరు పెట్టలేరు.స్మార్ట్‌ ఫోన్‌ పక్కకు పెట్టినా చూస్తూ ఉన్నా కూడా పరీక్షలు అంటే స్మార్ట్‌ ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించే విద్యార్థులకు విపరీతమైన భయం అంటూ తాజాగా అమెరికన్‌ యూనివర్శిటీ చేసిన ఒక సర్వేలో వెళ్లడయ్యింది.

Telugu Smart Phone, Telugu Ups-General-Telugu

 యూనివర్శిటీలోని మెడికల్‌ విద్యార్థులను ప్రశ్నించిన సమయంలో తాము అధికంగా స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగిస్తామని వారు చెప్పారు.అయితే వారికి తెలియకుండానే వారు పరీక్షలు అంటే విపరీతమైన టెన్షన్‌ పడటంతో పాటు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారట.కొందరు అయితే పరీక్షలు రాయలేక వదిలేస్తున్నామని కూడా అంటున్నారు.కాని ఎవరైతే స్మార్ట్‌ ఫోన్‌ వాడని విద్యార్థులు ఉన్నారో వారు పరీక్షల కోసం చదవకున్నా కూడా ఎక్కువగా టెన్షన్‌ పడటం లేదట.

అంటే స్మార్ట్‌ ఫోన్‌ వాడే వారికి పరీక్షలు అంటేనే భయం అవుతుంది.అందులో రాసేందుకు చదవాలనే కోరిక ఉన్నా కూడా కొందరు చదవలేక పోతున్నారు.మొత్తానికి స్మార్ట్‌ ఫోన్‌ విద్యార్థుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడవచ్చు.మీ పిల్లలను చిన్నప్పటి నుండే కాస్త స్మార్ట్‌ ఫోన్‌కు దూరంగా ఉంచండి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube