తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్దం

తెలంగాణ రాష్ట్రంలో రేపు మున్సిపల్‌ ఎన్నికలు జరుగబోతున్నాయి.రాష్ట్రం మొత్తంలో ఒకేసారి 120 మున్సిపాలిటీలు మరియు 9 కార్పోరేషన్‌లకు ఎన్నికలు జరుగబోతున్నాయి.

 Telangana Ready For Muncipal Election-TeluguStop.com

రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాబోతుంది.సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఎప్పటిలాగే అయిదు గంటల తర్వాత క్యూలో ఉన్న వారికి తమ ఓటును వినియోగించుకునే వీలు కల్పిస్తారు.ఈ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 44 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.

పోలింగ్‌ జరిగే ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నామని, ఎలాంటి అల్లర్లకు పాల్పడ్డా కూడా తీవ్రమైన చర్యలు తప్పవంటూ ఈ సందర్బంగా పోలీసులు మరియు ఎన్నికల అధికారులు ప్రకటించారు.ఈ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7911 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ ఎన్నికల్లో మొత్తం 5336605 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.ఓటింగ్‌లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసి 120 మున్సిపాలిటీలు మరియు 9 కార్పోరేషన్‌లలో తమ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నాలు చేసింది.సర్వేలు ఎక్కువగా టీఆర్‌ఎస్‌కు ఛాన్స్‌ ఉన్నట్లుగా వచ్చాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube