నేపాల్: గ్యాస్‌ లీక్, ఎనిమిది మంది భారతీయులు దుర్మరణం

నేపాల్‌లో విషాదం చోటు చేసుకుంది.ఆ దేశ పర్యటనకు వెళ్లిన 8 మంది కేరళ టూరిస్టులు రిసార్ట్‌లో గుర్తుతెలియని గ్యాస్ లీక్ కావడంతో మరణించారు.

 Telugu News Breaking/Featured News Slide-TeluguStop.com

మొత్తం 15 మంది పర్యాటకుల బృందం నేపాల్‌లోని డామన్‌కు వెళ్లి అక్కడి ఎవరెస్ట్ పానోరమా రిసార్ట్‌లో బస చేశారు.ఈ నేపథ్యంలో ఒక గదిలోని వాటర్ హీటర్ నుంచి వెలువడిన గ్యాస్‌ను పీల్చడంతో వారంతా అపస్మారక స్థితిలోకి జారుకున్నారు.

వీరందరిని రిసార్ట్ సిబ్బంది ఖాట్మాండూలోని హెచ్ఏఎంఎస్ ఆసుపత్రికి తరలించగా.అక్కడ చికిత్స పొందుతూ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.ఊపిరి అందకపోవడం వల్ల ఎనిమిది మరణించి వుండవచ్చని మక్వాన్‌పూర్ పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనపై ఖాట్మాండూలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది.

ఎనిమిది మంది బాధితులు విమానంలో ఖాట్మాండుకు తీసుకొచ్చారని తెలిపింది.వీరి ఆరోగ్య పరిస్ధితిని పరిశీలించడానికి, అవసరమైన సాయం అందించడానికి భారత వైద్యుడిని సంబంధిత ఆసుపత్రికి పంపినట్లు రాయబార కార్యాలయం ప్రకటించింది.

Telugu Everestpanorama, Gasleak, Nepal Resort, Telugu Ups-General-Telugu

 కేరళ వాసుల మరణం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మరణించిన వారిని ప్రవీణ్ కృష్ణన్ నాయర్, శరణ్య సాసి, శ్రీభద్ర ప్రవీణ్, ఆర్చా ప్రవీణ్, అభినవ్ శరణ్య నాయర్, రంజిత్ కుమార్ అదతోలత్ పునాతిల్, ఇందూ లక్ష్మీ పీఠంబరన్ రాగలాత, వైష్ణవ్ రంజిత్లుగా గుర్తించారు.ఈ 15 మంది పర్యాటకుల బృందం నేపాల్‌లోని ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ పోఖారాను సందర్శించి తిరిగి ఇంటికి వెళుతూ.సోమవారం రాత్రి మక్వాన్‌పూర్ జిల్లాలోని ఎవరెస్ట్ పనోరమా రిసార్ట్‌లో బస చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube