సరదాగా ట్రెక్కింగ్ కు వెళ్లి,ఏనుగుల దాడిలో మృతి చెందిన మహిళ

సరదాగా ట్రెక్కింగ్ కు అని వెళ్లిన వివాహిత మహిళ ఏనుగుల దాడిలో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదానికి దారితీసింది.కోవై గణపతి సమీపంలో నివస్తున్నభువనేశ్వరి అనే వివాహిత మహిళ శంకర కంటి ఆసుపత్రిలో నిర్వహణ అధికారిగా పనిచేస్తోంది.

 Woman Trekking Inside Coimbatore-TeluguStop.com

అయితే భర్త ప్రశాంత్,ఆమె తమ స్నేహితులతో కలసి ట్రెక్కింగ్‌కు వెళ్లారు.ఈ క్రమంలో ఆదివారం ఉదయం పెరియ నాయకన్‌పాళయం సమీపంలోని కొండలను ఎక్కేందుకు దంపతులు సహా ఏడుగురు కారులో బయల్దేరారు.

కొండ దిగువ భాగంలో కారును నిలిపిన వారు అక్కడి నుంచి కుళుంజూర్‌పతి కొండ గ్రామానికి వెళ్లారు.అక్కడి నుంచి 3 కి.మీ దూరంలో ఉన్న మాంగుళి అనే గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.అయితే మార్గమధ్యంలో వీరిని ఓ ఏనుగు వెంటాడడం తో భయాభ్రాంతులకు గురైన వారంతా కూడా తలో వైపుకు పరుగులు తీసుకుంటూ వెళ్లిపోయారు.

ఈ క్రమంలో భువనేశ్వరి అక్కడే దగ్గరలో ఉన్న పొదల్లో దాక్కోవడం గమనించిన ఏనుగు అక్కడకి వెళ్లి భువనేశ్వరి పై దాడి చేయడం తో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.సమాచారం అందుకున్న పెరియనాయకన్‌పాళయం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని భువనేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

ఈ ఘటనపై ఫారెస్ట్‌ రేంజర్‌ అధికారులు ట్రెక్కింగ్‌కు వెళ్లే వారు అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలని, కానీ చాలా మంది అనుమతులు లేకుండానే వెళుతున్నారన్నారు.అలాంటి సమయాల్లో జంతువుల దాడిలో వారు మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.

అయితే ఏనుగుల దాడిలో మృతి చెందిన భువనేశ్వరి కి 11 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube