చైనాలో అంతుచిక్కని వైరస్‌: భారతీయురాలిలో లక్షణాలు, ఐసీయూలో చికిత్స  

Indian In Treatment For Infection Earlier Thought To Be Sars-like Virus In China - Telugu Infection Earlier Thought To Be Sars, Nri, Sars, Teluagu Nri News Updates

చైనాను వణికిస్తున్న అంతుచిక్కని వైరస్ బారిన ఓ భారతీయ మహిళ పడింది.షెన్‌జెన్ నగరంలో 45 ఏళ్ల భారతీయ ఉపాధ్యాయురాలు స్ట్రెప్టోకోకల్ ఇన్‌ఫెక్షన్‌కు గురై చికిత్స పొందుతున్నాడు.

Indian In Treatment For Infection Earlier Thought To Be Sars-like Virus In China

దీనిని వైద్యులు మొదట్లో సార్స్‌ను పోలిన కరోనా వైరస్‌ కేసుగా అనుమానించారు.

షెన్‌జెన్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ప్రీతి మహేశ్వరి స్ట్రెప్టోకోకల్ ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు ఆమె భర్త అశుమాన్ ఖోవాల్ తెలిపారు.

ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై ప్రీతి చికిత్స పొందతుందని ఆయన వెల్లడించారు.చైనాలోని వుహాన్ నగరంలో ఈ అంతుచిక్కని వైరస్ ప్రబలంగా ఉంది.ఇది 2002-03లో చైనా, హాంకాంగ్‌లలో దాదాపు 650 మందిని చంపిన సార్స్ వైరస్‌ను పోలివున్నట్లు వైద్యులు తెలిపారు.ఇప్పటి వరకు వుహాన్‌లో ఈ వైరస్ బారిన పడి వారి సంఖ్య 62కి చేరుకుంది.

వీరిలో 19 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు.

అంటువ్యాధుల చికిత్సలో ప్రఖ్యాతిగాంచిన థర్డ్ పీపుల్స్ హాస్పిటల్‌లో షెన్‌జెన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను ప్రత్యేక వార్దులో ఉంచి పరిశీలిస్తున్నట్లు కథనాలు వెలువడ్దాయి.వుహాన్‌లో దాదాపు 500 మందికి పైగా భారతీయ విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.అక్కడ ప్రస్తుతం ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో భారత ప్రభుత్వం వారిని అప్రమత్తం చేసింది.