ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌ను షేక్ చేసిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది.ఇటీవల ‘వెంకీ మామ’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
కాగా తాజాగా మాస్‌రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘డిస్కో రాజా’ చిత్రంలో పాయల్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో అమ్మడి పాత్ర అదిరిపోతుందని చిత్ర యూనిట్ పేర్కొంది.
రవితేజ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో పాయల్ కనిపిస్తుందని, వారిద్దరి మధ్య నడిచే ట్రాక్ అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా నటిగా పాయల్‌కు మంచి గుర్తింపును తీసుకురావడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమాలో అమ్మడు ఎంత మేర అందాలను ఆరబోస్తుందా అని ఆమె ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు.
డిస్కో రాజా చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాగా దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.
మరి ఈ సినిమాలో పాయల్ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.