వైరల్ అవుతున్న అమెరికా యువతి పెళ్లి ఆహ్వానం..

పెళ్లి పిలుపులు పిలిచే సమయంలో సహజంగా అందరూ ఏమని పిలుస్తారు…పలానా రోజున పెళ్లి ఉంది తప్పకుండా మీరు మీ ఇంట్లో కుటుంభ సభ్యులు అందరూ రావాలి అంటారు.వీలుంటే రెండు రోజులు ముందుగానే వచ్చేయండి అంటారు.

 Bride Demands Wedding Guests To Spend 50 Dollars-TeluguStop.com

పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎదో ఒక బహుమతో, లేక ఉత్తి చేతులతోనో పెళ్ళికి వస్తారు.ఇలాంటివి ఎక్కడైనా ఒకేలా జరుగుతాయి.కానీ
అమెరికాలో ఓ యువతి మాత్రం ట్రెండ్ మార్చింది.నా పెళ్ళికి రండి అంటూనే వచ్చే వాళ్ళు 50 డాలర్లు బహుమతిగా తీసుకురండి అంటూ పిలుస్తోందట.ఈ విషయాన్ని పెళ్లి కూతురు తరుపు భంధువు అయిన ఓ యువతి తెలిపింది.ఆమె తెలిపిన వివరాల ప్రకారం తన పెళ్ళికి వచ్చే వారు ముందుగానే ఆన్లైన్ లో తనకి 50 డాలర్లు పంపాలని తెలిపిందట.

ఇలా ఎందుకు అని ఆమె పెళ్లి కూతురుని అడుగగా తన పెళ్ళికి చాలా ఖర్చు అవుతోందని పెళ్ళికి వచ్చే వారి నుంచీ ఆ ఖర్చులు రికవరీ చేయాలని అందుకే ఈ ప్రతిపాదన పెట్టానని చెప్పుకొచ్చిందట.

Telugu Dollars, Spend Dollars, Nri, Telugu Nri-

దాంతో పెళ్లి కూతురు చెప్పిన మాటలు విన్న ఆమె షాక్ అయ్యి సరే మేము నీ పెళ్ళికి రావడం లేదు, నీకు ఫోన్ లోనే శుభాకాంక్షలు చెప్తూ ఆశీర్వదిస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసిందట.ఈవిషయాన్ని సదరు యువతి సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.ఈ పోస్ట్ కి చాలా మంది తిట్టుకుంటుంటే, మరి కొంతమంది ఆ పెళ్లి కూతురుకి ఎంత ఆర్ధిక కష్టం వచ్చిందో అంటూ ఫీల్ అవుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube