కిడ్నాప్, అత్యాచారం: కామాంధుల బారి నుంచి యువతిని కాపాడిన స్నాప్‌చాట్

సోషల్ మీడియా ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోన్న సంగతి తెలిసిందే.ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాలు చిన్నా, పెద్దా అందరినీ గుప్పిట్లో పెట్టుకున్నాయి.

 Snapchat Identified As Antonio Salvador Hediberto Avarenga-TeluguStop.com

మంచి-చెడు, ఆనందం-విషాదం, ఉద్యమం-ఉద్వేగం ఇలా అన్ని రకాల భావోద్వేగాలకు వేదికవుతుంది.వీటి వల్ల ఎంతటి ప్రయోజనం ఉందో… అదే స్థాయిలో దుష్పరిణామాలు లేకపోలేదు.

అయితే స్నాప్‌చాట్ సాయంతో ఓ యువతి తన ప్రాణాలను రక్షించుకుంది.అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 14 ఏళ్ల యువతికి కొంతమంది దుండగులు మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేశారు.

ఈ నేపథ్యంలో ఆ యువతి స్నాప్‌చాట్ ద్వారా తాను కిడ్నాప్ అయిన విషయాన్ని స్నేహితులతో పంచుకుంది.దీంతో వారు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.రంగంలోకి దిగిన పోలీసులు ఉత్తర కాలిఫోర్నియా పట్టణం శాన్‌జోస్‌లోని మోటెల్ నుంచి బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Telugu Avarenga, Hediberto, Kidnappedteen, Telugu Nri Ups-

నిందితుల్లో ఒకరైన 55 ఏళ్ల ఆల్బర్ట్ వాస్క్వెజ్ బాధితురాలికి మత్తు మందు ఇచ్చి అనంతరం మరో ఇద్దరిని పిలిచాడు.ఆల్బర్ట్ కారులో ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.మోటెల్‌కు తీసుకెళ్లిన తర్వాత అక్కడ మరోసారి లైంగిక దాడి చేశాడు.

అతనిని అరెస్ట్ చేసిన తర్వాత మత్తు పదార్థాలు కలిగి వుండటం, అత్యాచారం వంటి అభియోగాలపై కేసులు నమోదు చేశారు.మిగిలిన ఇద్దరు నిందితులను ఆంటోనియో సాల్వడార్, హెడిబెర్టో అవారెంగాగా గుర్తించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube