వైరల్: కుక్క పంచాయతీతో పిచ్చెక్కిందట

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక తప్పిపోయిన కుక్క కేసు పోలీసులకు చుక్కలు చూపించిందట.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.

 Missing Dog Case In Uttarakhand Goes Becomes Viral-TeluguStop.com

ఉద్దాంసింగ్ నగర్‌ జిల్లాలో ఓ వ్యక్తికి రోడ్డు పక్కన ఓ కుక్క దొరికింది.దానిని తనవెంట ఇంటికి తీసుకెళ్లాడు ఆ వ్యక్తి.

కాగా తనకో కుక్క దొరికిందని, దాని యజమాని ఎవరైనా ఉంటే తనను సంప్రదించాలంటూ తన చిరునామాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

కాగా అతడికి మరుసటి రోజు ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేసి అది తన కుక్కే అని చెప్పాడు.

దీంతో ఆ యజమానిని వచ్చి కుక్కను తీసుకుపోవాల్సిందిగా సదరు వ్యక్తి తెలిపాడు.కాగా మరో వ్యక్తి కూడా ఫోన్ చేసి అది తన కుక్క అని, తనే ఆ కుక్కకు యజమానినంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో ఆ కుక్క అసలు యజమాని ఎవరో తేల్చాసిందిగా దాన్ని పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు ఆ కుక్క దొరికిన వ్యక్తి.

అటుపై పోలీసులు ఫోన్ చేసిన ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రమ్మని అన్నారు.

వారు చెప్పిన ఆనవాల్లు ఒకేలా ఉండటంతో ఆ కుక్క ఎవరిదో తేల్చడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.దీంతో ఆ కుక్కను ఒక రోజు పోలీస్ స్టేషన్‌లోనే పెట్టారట.

కాగా వారిద్దరిలో ఒకరు యజమానిగా మరొకరిని ఒప్పించడంతో ఆ కుక్కను వారికి అప్పగించినట్లు తెలుస్తోంది.

ఏదేమైనా ఒక కుక్క కూడా పోలీసులకు పిచ్చెక్కించడం నిజంగా విడ్డూరం అంటున్నారు ఈ విషయం తెలుసుకున్నవారు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube