యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఈ ఫోటోలో ప్రభాస్ చాలా అల్ట్రా స్టైలిష్ లుక్లో మనకు కనిపించాడు.ఇకపోతే ఈ సినిమాకు జాన్(Jaan) అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు గతంలో అనేక వార్తలు వచ్చాయి.
కాగా తాజాగా ఈ సినిమాకు జాన్(John) అనే పేరును పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండనుండటంతో జాన్ పేరునే సినిమాకు పెట్టాలని వారు చూస్తున్నారట.
ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ తన సత్తా ఏమిటో చూపించడం ఖాయమని అంటున్నారు ప్రేక్షకులు.కాగా ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
మరి ఈ సినిమా టైటిల్ విషయంలో ఏది ఫైనల్ అనేది మాత్రం చిత్ర యూనిట్ చెప్పేంత వరకు సస్పెన్స్ తప్పదంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్.