మూతపడనున్న షిర్డీ సాయి ఆలయం.. ఆందోళనలో భక్తులు

భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రశాంతతకు పేరొందిన షిర్డీలోని సాయి బాబా ఆలయానికి రోజూ వేలకొద్ది భక్తులు వస్తుంటారు.సాయి దేవుడిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు.

 Shirdi Sai Temple Doors To Get Closed-TeluguStop.com

ఇక్కడికి వచ్చాక తమ జీవితంలో ప్రశాంతత నిండిందంటూ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తుంటారు.అయితే ప్రశాంతతకు మారుపేరైన షిర్డీ ఆలయం నిరవధికంగా మూతపడనుంది.

అవును.షిర్డీ ఆలయ ట్రస్టు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.షిర్డీ జన్మస్థలంగా ‘పత్రి’ని అభివృద్ధి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ మేరకు షిర్డీ గ్రామస్థులు సమావేశమై వారు షిర్డీ ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు.గతంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ‘పత్రి’ని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది.

‘పత్రి’ని అభివృద్ధి చేస్తే షిర్డీ ఆలయ ప్రాధాన్యం తగ్గుతుందని, షిర్డీ ఆలయాన్ని పర్భణీకి తరలించేందుకే ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు షిర్డీ ఆలయ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో వారు షిర్డీ ఆలయాన్ని నిరవధికంగా మూసివేయనున్నట్లు తెలిపారు.కాగా ఈ విషయంపై సాయిబాబా భక్తులు ఆందోళన చెందుతున్నారు.మరి ఈ వివాదం ఎటు వెళ్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube