ఏపీ పీసీసీ చీఫ్ గా మాజీ మంత్రి

ఏపీ రాజకీయాలలో సుదీర్ఘ కాలం పరిపాలన కొనసాగించి, తరువాత ఎన్టీఆర్ చరిష్మా కారణంగా కొన్ని సంవత్సరాలు వెనకబడిన మరల వైఎస్ఆర్ కారణంగా తిరిగి ఏపీలో పట్టు సంపాదించుకుంది.అయితే వైఎస్ చనిపోయిన తర్వాత ఏపీలో మెల్లగా కాంగ్రెస్ చరిష్మా తగ్గుతూ వచ్చింది.

 Sailajanath Appiented Ap Pcc Chief-TeluguStop.com

ఇక ఉమ్మడి ఏపీని విభజించడం ద్వారా ప్రస్తుత ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపోయింది.కనీసం ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన ఉనికిని కోల్పోయింది అని చెప్పాలి.

దీంతో ఆ పార్టీలో కీలక నేతలతో పాటు క్రింది స్థాయి క్యాడర్ మొత్తం వైసీపీకి కన్వర్ట్ అయిపొయింది.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ఉనికి కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది.

ఇదిలా ఉంటే గత ఎన్నికల వరకు ఏపీ పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి ఉండేవారు.ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత అతను రాజకీయాలకి దూరంగా ఉండటంతో పాటు పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.

అప్పటి నుంచి పీసీసీ చీఫ్ పదవి ఖాళీగానే ఉంది.అయితే తాజాగా కొత్త ఏపీ పీసీసీ చీఫ్ పదవిని భర్తీ చేసింది.మాజీమంత్రి శైలజానాధ్‌ను ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమించింది.మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఎంపిక చేస్తారనే వార్తలు వినిపించాయి.

అలాగే సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు పేరు కొదొఆ వినిపించింది.అయితే ఫైనల్ గా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన శైలాజానాధ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.

మరి శైలజానాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాలలో ఎంత వరకు ఎమర్జింగ్ అవుతుంది అనేది ఇప్పుడు చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube