సాదారణంగా కోడి పందాలు అంటే ఆంధ్రా గుర్తుకు వస్తుంది.కాని ఈసారి హైదరాబాద్‌లో కూడా కోడి పందాలు జరిగినట్లుగా సమాచారం అందుతోంది.
అది కూడా ఒక ఆంధ్రాకు చెందిన హీరోగారి ఫామ్ హౌస్‌లో ఈ కోడి పందాలు జరిగినట్లుగా తెలుస్తోంది.హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న ఆ ఫామ్ హౌస్‌లో రెండు రోజుల పాటు భారీ ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈ కోడి పందాలు జరిగాయంటూ సమాచారం అందుతోంది.
రెండు రోజుల్లో దాదాపుగా పది కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా సమాచారం అందుతోంది.ఆంధ్రాకే పరిమితం అయిన కోడి పందాలు ఇలా పెద్ద ఎత్తున హైదరాబాద్‌లో జరగడం చర్చనీయాంశం అయ్యింది.
ఆంధ్రాలో ప్రభుత్వం సహకారంతో జరిగే ఈ కోడి పందాలు హైదరాబాద్‌లో కూడా కేసీఆర్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇదే పరిణామం కొనసాగితే ముందు ముందు హైదరాబాద్‌లో మరిన్ని జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక మొన్న జరిగిన హైదరాబాద్ కోడి పందాల్లో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు పాల్గొన్నట్లుగా సమాచారం అందుతోంది.