రోజు కూలీకి గట్టి ఝలక్ ఇచ్చిన ఐటీ అధికారులు

ఐటీ అధికారులు బాగా డబ్బు ఉన్నవారిపైనే తమ ఉక్కుపాదం మోపుతారు అన్న విషయం అందరికీ తెలిసిందే.కోట్ల కు కోట్లు సంపాదించి టాక్స్ కట్టకుండా తప్పుకుంటున్న వారి సంగతి ఏమోగానీ ఐటీ అధికారులు మాత్రం రోజు కూలీ చేసుకొనే వ్యక్తికి గట్టి ఝలక్ ఇచ్చారు.

 Daily Wager Who Earns Rs 300 Gets I Tnotice-TeluguStop.com

ముంబై లోని అంబివలి బస్తీ లో బాబు సాహెబ్ అనే దినసరి కూలీ గా జీవనం సాగిస్తుండగా,అతడికి కోటి రూపాయల ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాలి అంటూ నోటీసులు అందాయి.రెక్కాడితే గాని డొక్కాడని సాహెబ్ లబో దిబో మంటూ పోలీసుల వద్దకు వెళ్ళాడు.

అసలు వివరాల్లోకి వెళితే….ముంబై లోని అంబలివలి బస్తీ లో బాబు సాహెబ్ అనే వ్యక్తి దినసరి కూలీగా జీవితం గడుపుతూ రోజుకు రూ.300 రూపాయలు సంపాదిస్తున్నాడు.అయితే అతడికి ఐటీ శాఖ నుంచి ఒక్కసారిగా నోటీసులు అందాయి.

ఆ నోటీసులో కోటి రూపాయల సొమ్మును పన్నుతో పాటు అపరాధరుసుము కూడా కట్టాలి అంటూ నోటీసులల్లో పేర్కొన్నారు.దీనితో కంగారు పడిపోయిన సాహెబ్ పోలీసుల వద్దకు పరుగుపరుగున పోయి అసలు విషయం చెప్పాడు.

అయితే విచారణలో తేలిన అసలు విషయం ఏమిటంటే…2016లో డీమానిటైజేషన్ సమయంలో బాబు సాహెబ్ అకౌంట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ.58లక్షలు డిపాజిట్ చేసినట్లు తెలిసింది.అయితే ఈ విషయం అసలు తనకు తెలియదని పోలీసులతో మొరపెట్టుకుంటే ఐటీ ఆఫీసు లో అధికారులు బ్యాంకుకు వెళ్లి కనుక్కుంటే అతని పాన్ కార్డు మీద అకౌంట్ ఓపెన్ అయ్యిందని, అయితే అతడి స్థానం లో వేరే వ్యక్తి ఫొటో, ఫోర్జరీ సంతకాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube