ప్రస్తుతం టాలీవుడ్ లోని కొందరు హీరోలు వెబ్ సిరీస్ ల వైపు మొగ్గుచూపుతున్నారు.మరికొందరైతే టాలీవుడ్లో విలన్ పాత్రలు చేస్తూ తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు.
అయితే ఒకప్పటి స్టార్ హీరోల్లో ఒకరైన అటువంటి సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా తాజాగా “చదరంగం’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.ఈ వెబ్ సిరీస్ ను యాక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు నిర్మిస్తున్నాడు.
అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించినటువంటి ట్రైలర్ విడుదలయింది. ఈ ట్రైలర్ విశేషాలను ఒకసారి పరిశీలిస్తే ఈ వెబ్ సిరీస్ మొత్తం పూర్తిగా రాజకీయ పరిస్థితులు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
అంతేకాక ఇందులో శ్రీకాంత్ ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాగినీడు, కౌసల్య, సునయన వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే ఈ చిత్రాన్ని వచ్చే నెలలోనే 20వ తారీఖున జీ5 ఛానెల్ లో ప్రసారం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం శ్రీకాంత్ టాలీవుడ్ లో మార్షల్, కోతల రాయుడు వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.