వి కి గుమ్మడి కాయ కొట్టిన నాని...

తాజాగా నాచురల్ స్టార్ నాని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్నటువంటి “వి” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో నానితో పాటూ నివేదా థామస్, అతిథి రావు హైదరి, సుధీర్ బాబు వంటివారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

 Latest News About Natural Star Nani New Movie-TeluguStop.com

అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ ఈరోజుతో పూర్తయింది. దీంతో హీరో నాని ఈ చిత్ర షూటింగ్ పూర్తయిన సందర్భంగా గుమ్మడికాయ కొట్టి ముగింపు పలికారు.

ఈ విషయాన్ని నాచురల్ స్టార్ నాని తన సోషల్ మీడియా సామాజిక మాధ్యమ అయినటువంటి ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా తెలిపారు.

అయితే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన వార్తలేమి బయటి ప్రపంచానికి తెలియకుండా చాలా సైలెంట్ గా ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

అయితే ఈ చిత్రాన్ని ఉగాది పండుగ కానుకగా మార్చి నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రం ఓ థ్రిల్లర్ సస్పెన్స్ గా ఉండబోతున్న ట్లు ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Telugu Nani, Natural Nani, Nivetha Thamos, Sudheer Babu, Tollywood-Movie

అయితే గతేడాది జెర్సీ సినిమాతో నాని బాగానే ఆకట్టుకున్నా ఈ ఏడాదిలో వచ్చినటువంటి గ్యాంగ్ లీడర్ తో మాత్రం తన అభిమానులను  అంతగా మెప్పించలేకపోయాడు.అయితే తాజాగా నాని శివ నిర్వాణ దర్శకత్వంలో జగదీశ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు కూడా విడుదలయ్యాయి.అంతేగాక ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరణ పూర్తి చేసినట్లు దర్శకులు పలు సందర్భాల్లో తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube