ఆస్కార్ కి ఎన్నికైన భారత సంతతి దర్శకులు..!!!

ఆస్కార్ అవార్డ్ అంటే ప్రపంచంలోనే సినిమా వాళ్లకి ఇచ్చే అత్యున్నత పురస్కారం.ఈ పురస్కారం కోసం ఎంతో మంది సినిమా నటులు పోటీ పడుతూ ఉంటారు.

 Indo American Producers In Oscar Nominations-TeluguStop.com

తాము నటించే సినిమాలని ఆస్కార్ నామినేషన్స్ కి పంపుతారు.ఒక్క సారైనా ఈ ఆస్కార్ అవార్డ్ రాకపోతుందా అంటూ విశ్వప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇప్పటి వరకూ భారతీయులకి నేరుగా మన సినిమాలకి ఆస్కార్ రాకపోయినా…

విదేశీ సినిమాలతో కలిసి పనిచేయడం వలన ఒకరిద్దరు భారతీయులకి ఆస్కార్ అవార్డ్ లు వచ్చాయి.అయితే తాజాగా ఆస్కార్ అవార్డుల నామినేషన్లలో భాగంగా అవార్డులకి గాను ఎంపికైన నామినేషన్ లని కమిటీ ప్రకటించింది.

  కమిటీ ప్రకటించిన ఈ జాబితాలో భారత సంతతికి చెందిన అమెరికా దర్శకులు రూపొందించిన  సెయింట్ లూయీస్ సూపర్ మ్యాన్ డాక్యుమెంటరీ కి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ సబ్జెక్ట్ విభాగంలో నామినేషన్ అర్హత సాధించింది.

ఈ షార్ట్ ఫిల్మ్ ని స్మృతీ ముద్ర, సమీ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమా అత్యధికంగా 11 విభాగాలలో నామినేషన్లు దక్కించుకుంది.వన్స్ అపాన్ టైం ఇన్ హాలీవుడ్, ది ఐరిష్ మ్యాన్ అనే సినిమాలు కూడా 10 విభాగాలలో అర్హత సాధించాయి.

అయితే భారత సంతతి దర్శకుల సినిమా ఆస్కార్ కి నామినేటెడ్ అవడంతో అమెరికాలోని ప్రవాస భారతీయులు అందరూ వారికి బెస్ట్ విషెస్ చెప్తూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube