22 రోజులు మంచులోనే..ఎట్టకేలకి ఎలా బయటపడ్డాడంటే..!!!

అమెరికాలో మంచు కురవడం సర్వ సాధారణమైన విషయమే.అయితే గత కొన్ని రోజులుగా మాత్రం మంచు తుఫానులా రావడంతో ప్రజలు బయటకి రావడానికి కూడా బయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

 Man Survived 22 Freezing Days In Alaska 22-TeluguStop.com

ఈ క్రమంలోనే అలాస్కాలో టైసన్ అనే  ఓ వ్యక్తి  తాను ఉండే ప్రాంతానికి సుదూరంగా నివస్తున్నాడు.చలి ప్రభావంతో అతడు ఇంట్లో మంట వేసుకోగా, ఆ మంటలు ఒక్క సారిగా తన ఇంటి పై కప్పుకి అంటుకోవడంతో ఒక్క సారిగా అతడు షాక్ అయ్యాడు, క్షణాలలో మొత్తం ఇల్లు అంతా మంటలు వ్యాపించడంతో పరుగు పరుగున బయటకి వచ్చేశాడు.

అయితే.ఈ క్రమంలోనే ఇంట్లో తానూ ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క కూడా ఉండటంతో మళ్ళీ లోపలికి వెళ్లి దానిని బయటకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించాడు.ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల కోసం వెదుక సాగాడు.మంటలు ఒక్క సారిగా పెరగడంతో బయటకి వచ్చేశాడు .అయితే కుక్క లోపలే  ఉండటంతో అక్కడికక్కడే అది చనిపోయింది.

అంతేకాదు.

అతడికి ఉండటానికి ఏమి లేకపోవడంతో కొన్ని పుల్లలు తెచ్చుకుని చిన్న గూడులా ఏర్పాటు చేసుకున్నాడు.దొరికిన ఆహరం తింటూ, పాడుకుంటూ అలా 22 రోజులు గడిపాడు.

ఎవరైనా రెస్క్యూ టీం వస్తారనే ఆసతో SOS( ప్రమాదంలో ఉన్నాను అనే సూచిక)  అనే అక్షారాలని మంచుపై పెద్దగా రాశాడు.మంచు ప్రభావంతో ఎవరైనా భాదితులు చిక్కుకున్నారేమో నని రెస్క్యూ టీమ్ వెళ్తూ అతడు రాసిన అక్షారాల్ని చూసి వెంటనే అతడి వద్దకి వెళ్లి రక్షించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube