తీహార్ జైల్లో దయ్యాలు హల్ చల్...

దేశంలో కరుడుగట్టిన ఖైదీలను ఉంచే జైలు అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది తీహార్ జైలు.కోర్టులో క్రూరమైన కేసుల్లో కఠిన కారాగార శిక్ష పడిన వారిని ఈ జైలుకి పంపిస్తారు.

 Tihar Kargaramlo Deyyalu Halchal-TeluguStop.com

అంతేగాక దేశంలోనే అతి భయంకరమైన జైలుగా ఈ తీహార్ జైలుకు పేరుంది.

అయితే ప్రస్తుతం జైల్లో దెయ్యాల తిష్ట వేశాయి.

 దీంతో అక్కడ ఉన్నటువంటి ఖైదీలు రాత్రిపూట సమయంలో భయాందోళనలకు గురవుతున్నారు.ముఖ్యంగా ఇప్పటికే పలువురు ఖైదీలు తమతో ఆత్మలు మాట్లాడుతున్నాయని అంతేగాక పలు వింత శబ్దాలు కూడా వినిపిస్తున్నాయని ఖైదీలు చెబుతున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా గతంలో ఇక్కడ శిక్ష అనుభవించిన టువంటి ఓ ఖైదీ తను సుమారుగా ఐదు సంవత్సరాలుగా ఈ జైలులో ఉంటున్నానని రాత్రిపూట తను ఒంటరిగా ఉన్న సమయంలో ఏవో వింత శబ్దాలు వినబడ్డాయని దాంతో అవేంటో తెలుసుకోవడానికి తాను ఎంతో ప్రయత్నించాలని కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ అవి ఏంటో తెలుసుకోలేక పోయానని చెప్పుకొచ్చాడు.అయితే మరో వ్యక్తి ఏకంగా ఏదో ఆత్మ చెప్పిందని తన తోటి ఖైదీ ని హతమార్చిన ఘటన కూడా తీహార్ జైలులో చోటుచేసుకుంది.

అయితే ఈ సంఘటనలను చూస్తుంటే జైల్లో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా అన్న సందేహం కలగక మానదు.

Telugu Devil, Jail, Tihar, Tihar Jail-Telugu Crime News(క్రైమ్ వ�

అయితే ఇది ఇలా ఉండగా అధికారులు మాత్రం ఈ దెయ్యాల వార్తలను కొట్టి పారేస్తున్నారు.జైల్లో దెయ్యాలు ఆత్మలు వంటివి ఏమీ లేవని కొందరు ఖైదీలు ఎక్కువ కాలం పాటు జైలులో గడపటం వల్ల వారి మానసిక స్థితి సరిగా లేదని అంటున్నారు.అలాగే వీళ్లు చెప్పిన ఈ విషయాలను కొంతమంది అధికారులు పరిగణలోకి తీసుకొని జైలులో సీక్రెట్ కెమెరాలు అమర్చారు.

అయితే ఆ కెమెరాలలో ఎటువంటి అనుమానాస్పద ఘటనలు రికార్డ్ కాలేదు.దీంతో సదరు పోలీసు అధికారులు ఇవన్నీ వదంతులు మాత్రమేనని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube