దర్శక నిర్మాతలకి వైకుంఠాపురాన్ని చూపిస్తున్న స్టైలిష్ స్టార్...  

Latest News About Stylish Star New Movie Ala Vaikuntapuram Lo Collections-ala Vaikuntapuram Lo Allu Arjun,ala Vaikuntapuram Lo Latest Collections,ala Vaikuntapuram Lo News,pooja Hegde Ala Vaikuntapuram Lo

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  దర్శకత్వం వహించిన టువంటి అలా వైకుంఠపురంలో చిత్రం తాజాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించగా బన్నీ సరసన పూజా హెగ్డే, నివేత పేతురాజ్ కథానాయికలుగా నటించారు.

Latest News About Stylish Star New Movie Ala Vaikuntapuram Lo Collections-Ala Allu Arjun Ala Collections Pooja Hegde

ఎన్నో అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన టువంటి చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.అయితే ఇప్పటికే మొదటిరోజు కలెక్షన్ల పరంగా  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన టువంటి బాహుబలి చిత్ర రికార్డులను బద్దలు కొట్టింది.

కాకపోతే ఈ రికార్డు న్యూజిలాండ్ దేశంలో నమోదయింది.ఈ చిత్రాన్ని ఈ నెల 11వ తారీకున న్యూజిలాండ్ ప్రీమియర్ షోలు  మొత్తం మూడు చోట్ల ఆడించగా 34,625 డాల ర్ల ను వసూలు చేసింది.

అయితే గతంలో లో బాహుబలి చిత్రం ఈ ప్రీమియర్ షోలలో 21,290 డాలర్లు మాత్రమే వసూలు చేసింది.దీంతో అలా వైకుంఠపురం చిత్రం బాహుబలి రికార్డుని న్యూజిలాండ్ దేశంలో బ్రేక్ చేసింది.

అయితే బన్నీ తన రికార్డుల పరంపరను కొనసాగిస్తూ అమెరికాలో కూడా ప్రీమియర్ షోల ద్వారా దాదాపుగా 557, 825 డాలర్లు వసూలు చేసి సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సవాలు విసిరింది.ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అల వైకుంఠ పురం లో చిత్రం మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రం కలెక్షన్ల పరంగా తీవ్ర పోటీ పడుతున్నాయి.

మొత్తానికి ఈ రెండు చిత్రాల దర్శక నిర్మాతలకు సినిమా టాక్ పరంగానూ కలెక్షన్ల పరంగానూ పెద్ద పండగ జరిగిందని చెప్పవచ్చు.

తాజా వార్తలు

Latest News About Stylish Star New Movie Ala Vaikuntapuram Lo Collections-ala Vaikuntapuram Lo Allu Arjun,ala Vaikuntapuram Lo Latest Collections,ala Vaikuntapuram Lo News,pooja Hegde Ala Vaikuntapuram Lo Related....