ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతపై పోస్ట్: జోక్ చేశానన్న భారత సంతతి ప్రొఫెసర్‌, క్షమాపణలు

ఖాసీం సులేమానీ హత్యతో ప్రస్తుతం అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.ఇలాంటి పరిస్ధితుల్లో ఇరాన్ పరిస్థితిపై ఫేస్‌బుక్‌లో జోక్ పోస్ట్ చేసిన అమెరికాలోని భారత సంతతి ప్రొఫెసర్‌‌ను కళాశాల యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.

 Asheen Phansey America India Profesor-TeluguStop.com

డబ్ల్యూబిజెడ్ ప్రచురించిన కథనం ప్రకారం.అషీన్ ఫాన్సే అనే ప్రోఫెసర్ బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ప్రత్యేకత కలిగిన బాబ్సన్ కాలేజీలో సస్టైనబిలిటీ విభాగంలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.

ఇది బోస్టన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని వెల్లెస్లీలో ఉంది.ఇరాన్‌పై దాడి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌కు స్పందించిన ఆషీన్ ఫేస్‌‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

సాంస్కృతిక ప్రదేశాలపై బాంబు దాడి చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధనేరమని, అలాగే డొనాల్డ్ ట్రంప్ వైఖరికి విరుద్ధమని అమెరికా అధికారులు చెప్పినట్లు అషీన్ తెలిపాడు.

Telugu Asheen Phansey, Asheenphansey, Professorasheen, Telugu Nri Ups-

అయితే మిన్నెసోటాలోని మాల్ ఆఫ్ అమెరికా, కర్దాషియన్ల నివాసం వంటి 52 ప్రాంతాలను ఇరాన్ బాంబు దాడులకు ఎంచుకోవాలని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో అషీన్ రంగంలోకి దిగాడు.ఫేస్‌బుక్‌లో తన మిత్రులకు చేసిన ఒక జోక్‌ని ప్రజలు ఉద్దేశపూర్వకంగా తప్పుగా అర్ధం చేసుకున్నారు.

అయితే తన కళాశాల యాజమాన్యం మద్ధతుగా నిలుస్తుందని ఆయన ఆశించారు.కానీ చివరికి ఆయన క్షమాపణలు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube