పృధ్విని ఇరికించింది వారేనా ? అసలు కథేంటి ?

30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అతడు ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ కమెడియన్ పృథ్వి రాజ్ ని బాగా ఫేమస్ అయ్యేలా చేసింది.ఆ తర్వాత వరుస వరుసగా సినీ అవకాశాలు పెరిగి బిజీ అయిపోయారు.

 Comedian Pruthvi Comments On Ycp Party Leaders-TeluguStop.com

అంత బిజిలోనూ మెల్లిగా రాజకీయాల వైపు తొంగి చూశారు.వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్రలో కూడా పాలు పంచుకుంటూ జగన్ కు మరింత చేరువయ్యారు పృద్వి.

ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఆయనకు అత్యంత ప్రాధాన్యం ఉన్న ఎస్సీ బీసీ చైర్మన్ పదవిని కూడా అప్పగించారు.దీనిపై మొదటి నుంచి జగన్ కు అండగా ఉంటూ, మద్దతుగా మాట్లాడుతూ వస్తున్న పోసాని కృష్ణమురళి వంటివారు తమకు ఏ పదవి దక్కలేదని కానీ తమకంటే జూనియర్ అయిన పృథ్వి కి పదవి దక్కిందని కాస్త గుర్రుగా ఉంటూ వచ్చారు.

Telugu Pruthvi, Pruthvi Ycp, Posanikrishna, Svbcchairman, Ycp, Yv Subba Reddy-

ఇంతవరకు బాగానే ఉన్నా కొద్ది రోజుల క్రితం అమరావతి రైతులను ఉద్దేశించి పృథ్వి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అదే పార్టీకి చెందిన పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు.పృద్వి వెంటనే మీడియా సమావేశం పెట్టి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.అర్హతలేని వారందరికీ పదవులు ఇస్తే ఇలాగే ఉంటుంది అన్నట్టుగా డైలాగ్ పేల్చారు పోసాని.ఇక ఆ తర్వాత పృద్వి దానిపై ప్రతిస్పందించడం, పార్టీ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఇవన్నీ జరిగాయి.

తరువాత ఆయన ఓ మహిళతో చనువుగా మాట్లాడిన మాటల ఆడియో లీక్ అయింది.దీంతో ఉద్యోగులు ప్రెస్ మీట్ పెట్టారు.ఇక జగన్ ఆయన పదవికి రాజీనామా చేయాలని ఆదేశించడం, ఆయన పదవికి రాజీనామా చేయడం ఇవన్నీ చోటుచేసుకున్నాయి.

Telugu Pruthvi, Pruthvi Ycp, Posanikrishna, Svbcchairman, Ycp, Yv Subba Reddy-

దీనిపై జగన్ విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి కి నేను దగ్గరవుతున్న అనే కారణంతో నా పై కొంతమంది కావాలని కుట్రలు చేస్తున్నారని, అది సొంత పార్టీ నేతలే చేస్తున్నారంటూ ఆయన చెప్పారు.ఇక విషయానికి వస్తే మొదటి నుంచి పృథ్వి కి టీటీడీ చైర్మన్ గా ఉన్న వై.వి.సుబ్బారెడ్డి కి అభిప్రాయ బేధాలు ఉన్నాయి.గతంలో యస్వీబీసీ లో ఉన్న 36 మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని పృద్వి నియమించడం, ఉద్యోగాల నిమిత్తం ఒక్కొక్కరి దగ్గర సుమారు 10 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు రావడం, వారందరిని తొలగిస్తున్నట్టు సుబ్బారెడ్డి ప్రకటించడంతో వారి మధ్య మరింతగా అభిప్రాయం బేధాలు తలెత్తినట్టు తెలుస్తోంది.

Telugu Pruthvi, Pruthvi Ycp, Posanikrishna, Svbcchairman, Ycp, Yv Subba Reddy-

దీనికి కారణం ఏంటి అంటే టిటిడి బోర్డు తోపాటు ఎస్ వీ బీసీ చైర్మన్ పదవిని కూడా మొదటగా సుబ్బారెడ్డి కి జగన్ కట్టబెట్టారు.ఆ తరువాత కొద్ది రోజులకే ఎస్వీబీసీ చైర్మన్ గా సుబ్బారెడ్డిని తొలగించి పృథ్వి కి చైర్మన్ పదవి ఇచ్చారు.దీంతో సుబ్బారెడ్డికి పృథ్వి కి మధ్య వార్ మొదలైనట్టు ప్రచారం ఉంది.ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కనిపిస్తున్న ఆరోపణలు, సాక్షాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగాయన్న వాదన కూడా లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube