విడ్డూరం: స్నానం చేస్తున్నాడని భర్తకు విడాకులిచ్చిన భార్య  

Wife Gives Divorce To Husband For Over Cleanliness-bengaluru News,divorce,husband,ocd,wife

ఒక వ్యక్తి రోజుకు ఒకటి లేదా రెండుసార్లు స్నానం చేయడం మనం చూస్తుంటాం.రెండురోజులకు ఒకసారి స్నానం చేసే వారి గురించి కూడా మనం వినుంటాం.

Wife Gives Divorce To Husband For Over Cleanliness-Bengaluru News Divorce Husband Ocd

కానీ ఓ భర్త రోజంతా స్నానం చేస్తున్నాడని విసుగు చెందిన భార్య అతడికి విడాకులిచ్చిన ఘటన బెంగుళూరు నగరంలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.బెంగుళూరుకు చెందిన ఓ టెక్కీ(32) తన శరీరం అపరిశుభ్రంగా ఉందని రోజుకు 8 గంటలపాటు స్నానానికే కేటాయించేవాడు.ఒక్కసారి బాత్రూంకు వెళితే ఓ సబ్బు పూర్తిగా అరగాల్సిందే.

తమ పుత్రుడి వింత ప్రవర్తన చూసిన అతడి తల్లి, వివాహం జరిగితే మారుతాడని ఓ అమ్మాయిని చూసి ఆ కార్యం కూడా కానిచ్చేసింది.కానీ మనోడికి బాత్రూం అలవాటు మాత్రం మారలేదు.రోజూ ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు ఇదే తతంగం చేస్తూ గడిపాడు.

దీంతో అతడి భార్యకు మనోడిపై ఏదో అనుమానం కలగగా, అతడికి అతిశుభ్రంగా ఉండే అబ్సెస్సివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ) లేదా గీళు జబ్బు ఉందని తెలిసింది.

దీంతో ఆ భర్త వద్దంటూ భార్య విడాకులు తీసుకుంది.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.కాగా వైద్యుల సహాయంతో ప్రస్తుతం అతడు అతిగా స్నానం చేసే అలవాటును తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

Wife Gives Divorce To Husband For Over Cleanliness-bengaluru News,divorce,husband,ocd,wife Related....