హైవేపై బూతు పురాణం.. కళ్లు మూసుకున్న ప్రయాణికులు  

Teens Accused Of Putting Video On Billboard Charged-billboard,crime News,highway,michigan

హైవేపై ప్రయాణం చేసే వాహనదారులు చాలా జాగ్రత్తగా తమ వాహనాలను నడుపుతుంటారు.రోడ్డుపై కనిపించే ప్రతి సైన్ బోర్డును వారు పరిశీలిస్తూ ముందుకు సాగుతారు.

Teens Accused Of Putting Adult Video On Billboard Charged-Billboard Crime News Highway Michigan

అయితే ఇలాంటి హైవేలపై వచ్చే సైన్ బోర్డులను పట్టించుకోకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతాయని వారు అంటారు.కానీ అమెరికాలోని మిచిగాన్ హైవేపై ఉన్న ఓ బిల్‌బోర్డును మాత్రం వారు చూడకుండా కళ్లుమూసుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇంతకీ ఆ బిల్‌బోర్డులో ఏముందని మీరు అనుకుంటున్నారా? కొన్ని రోజుల క్రితం మిచిగాన్ నేషనల్ హైవేపై ఉన్న ఓ బిల్‌బోర్డులో రాత్రి 11 గంటల సమయంలో బూతు వీడియో దర్శనమిచ్చింది.దాదాపు 17 నిమిషాలపాటు హైవేపై వాహనదారులు ఈ బూతు తతంగాన్ని చూస్తూనే ఉన్నారు.

కొందరు మాత్రం ఈ వీడియోను చూడకుండా కళ్లు మూసుకుని వెళ్లిపోయారు.అసలు హైవేపై ఉన్న ఈ బోర్డులోకి బూతు పురాణం ఎలా వచ్చిందనే విషయాన్ని అమెరికా పోలీసులు చేధించారు.

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరు యువకులు బిల్‌బోర్డును కంట్రోల్ చేసే గది దగ్గరకు వెళ్లి తమ మొబైల్‌లోని సదరు బూతు వీడియోను బోర్డుపై వచ్చేలా లింక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.దీంతో ఆ ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తాజా వార్తలు